సీరియల్లో పద్దతిగా.. బయట అరాచకంగా.. వసుధారను చూస్తే ఫ్యూజుల్ అవుట్
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై బాహుబలి రేంజ్ రికార్డ్ క్రియేట్ చేసిన సీరియల్ కార్తీక దీపం. ఆ తర్వాత అదే స్థాయిలో ప్రేక్షకాధరణ పొందిన సీరియల్ గుప్పెడంత మనసు.
చదువు కోసం ఓ అమ్మాయి పడే ఆరాటం.. కొడుకు ప్రేమ కోసం ఓ తల్లి పడే తపన.. తల్లిని అమితంగా ద్వేషించే తనయుడు.. ఇదే గుప్పెడంత మనసు స్టోరీ.
ఇందులో రిషి పాత్రలో ముఖేష్ గౌడ, వసుధార పాత్రలో రక్ష గౌడ నటించగా.. వీరిద్దరి జోడికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే.
2020లో ప్రారంభమైన ఈ సీరియల్ 2024లో ముగిసింది. అయితే సీరియల్ కంప్లీట్ అయిన తర్వాత రక్ష గౌడ మరో సీరియల్ ఒప్పుకున్నట్లు తెలియడం లేదు.
కానీ అమ్మడు ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాలో నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్స్ మతిపోగొట్టేస్తుంది.