Tollywood: ఈ హీరోయిన్ సినిమాల్లో ఫ్లాప్.. లైఫ్‌లోనూ ఫెయిల్యూర్.. ఏకంగా మూడు పెళ్లిళ్లు.. గుర్తు పట్టారా?

కారణాలేమైనా కానీ ఈ మధ్యన సినిమా తారల జీవితాల్లో విడాకులు సర్వసాధారణమైపోయాయి. కొందరు పెళ్లి చేసుకున్న ఒకటి రెండేళ్లకే తమ వైవాహిక బంధాన్ని ముగిస్తుంటే మరికొందరు 30 ఏళ్లు కలిసుండి కూడా విడిపోతున్నారు.

Tollywood: ఈ హీరోయిన్ సినిమాల్లో ఫ్లాప్.. లైఫ్‌లోనూ ఫెయిల్యూర్.. ఏకంగా మూడు పెళ్లిళ్లు.. గుర్తు పట్టారా?
Tollywood Senior Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2024 | 4:24 PM

సినిమా తారలు తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినిమాల పరంగానో, పర్సనల్ లైఫ్ విషయాలతోనూ న్యూస్ లో నానుతూ ఉంటారు. అయితే పై ఫొటోలో ఉన్న నటి మాత్రం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆమె తల్లిదండ్రులు సినిమాల్లో సూపర్ స్టార్స్. కానీ ఈ నటి మాత్రం యాక్టింగ్ లో వారి దరిదాపులకు కూడా చేరలేకపోయింది. దళపతి విజయ్, రాజ్ కిరణ్, భానుచందర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లోనూ ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కాలేదు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ మూడు విడాకులతోనే ముగిశాయి. దీంతో ఇప్పుడు తన పిల్లలతో ఒంటరిగా జీవితం గడుపుతోంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఈపాటికే అర్థమై ఉంటుంది. యస్ ఈ అమ్మడు మరెవరో కాదు వనితా విజయ్ కుమార్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. ప్రస్తుతం వనితా విజయ్ కుమార్ కూతురు జోవికా కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వనితాకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రముఖ నటుడు విజయ్ కుమార్, ఆయన రెండో భార్య మంజుల కూతురే వనితా విజయ్ కుమార్. కెరీర్ ప్రారంభంలో దేవి లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలో నటించిన ఆమె ఆ తర్వాత విజయ్, రాజ్ కిరణ్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుది. అయితే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యిందీ అందాల తార. ముఖ్యంగా తన మూడు పెళ్లిళ్లతో సినిమాల్లో సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

వనితా విజయ్ కుమార్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Vanitha (@vanithavijaykumar)

వనితా మొదటి భర్త ఆకాష్ కూడా ఒక నటుడే. వీరికి శ్రీహరి అనే కొడుకు ఉన్నాడు. అయితే వనితా – ఆకాష్ లపెళ్లి 7 ఏళ్లకే ముగిసింది. 2007 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది వనిత రెండో పెళ్లి చేసుకుంది. దీంతో కుమరుడు శ్రీహరి తండ్రి ఆకాష్ తో వెళ్లిపోయాడు. ఇక వనితా రెండో భర్త రాజన్. వీరికి ఇద్దరు ఆడపిల్లలు – జోవికా, జయనిక. ఈ పెళ్లి కూడా 5 ఏళ్లకే పెటాకులైంది. ఇక 2020 లాక్ డౌన్ సమయంలో పీటర్ పాల్ ని వనిత పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని నెలలకే ఈ పెళ్లి బంధం కూడా ముగిసింది. ఇలా పెళ్లిళ్లతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న వనిత గతేదాది `మళ్లీపెళ్లి` సినిమాలో నరేష్‌ మూడో భార్య పాత్రలో నటించి ఆకట్టుకుంది.

View this post on Instagram

A post shared by Vanitha (@vanithavijaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.