AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక చూస్తారుగా కీర్తి సురేష్ గ్లామర్ షో..!

ఈ మధ్యే గ్లామర్ షోకు తెరతీసిన కీర్తి సురేష్.. బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోతుంది. ఈమె తీరు చూస్తుంటే టాలీవుడ్‌కు బైబై చెప్పినట్లే అనిపిస్తుంది. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్‌కు మాత్రం ఉండదా చెప్పండి..?

Keerthy Suresh: ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక చూస్తారుగా కీర్తి సురేష్ గ్లామర్ షో..!
Kirti Suresh
Praveen Vadla
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 26, 2024 | 4:07 PM

Share

ఇప్పటి వరకు ఒకెత్తు ఇక నుండి ఒక ఎత్తు.. కీర్తి సురేష్‌ను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. ఇన్నాళ్ళూ ఒకలెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లుందిప్పుడు కీర్తి తీరు జోరు చూస్తుంటే..! అప్పట్లో విద్యా బాలన్ డర్టీ పిక్చర్ కోసం చేసిన గ్లామర్ షో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి వరకు చాలా పద్దతిగా ఉంటూ.. ఎక్కడా గీత దాటకుండా కనిపించిన విద్యా.. ఒకేసారి డర్టీ పిక్చర్ కోసం సినిమా మొత్తం మార్చేసింది.. గ్లామర్ సినిమా ఓపెన్ చేసింది. దెబ్బకు ఆ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుంది విద్యా బాలన్. ఇప్పుడు కీర్తి సురేష్ మాత్రం నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత రెచ్చిపోవడం మొదలు పెట్టింది. అయినా కెరీర్ మునిగిపోతున్నపుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి.. లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి.

కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను మాత్రం ఫస్ట్ టైప్ అంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్యే గ్లామర్ షోకు తెరతీసిన ఈమె.. బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోతుంది. ఈమె తీరు చూస్తుంటే టాలీవుడ్‌కు బైబై చెప్పినట్లే అనిపిస్తుంది. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్‌కు మాత్రం ఉండదా చెప్పండి..? కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం..? పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే..! దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెర తీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లగా అటు వైపు ఈ మోడ్రన్ మహానటి అడుగులు పడుతున్నాయి.

నటిగా గుర్తింపు ఉంది.. సాక్ష్యంగా జాతీయ అవార్డు ఉంది.. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే.. కీర్తి సురేష్ కూడా మేకోవర్ అయ్యారు. టిల్లు స్క్వేర్‌లో అనుపమ 2.0 కనిపించారు. ఇదే దారిలో కీర్తి సురేష్ కూడా వెళ్తుందిప్పుడు. బాలీవుడ్ కోసం ఈమె మారిపోయింది. వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమా కోసం భారీగానే అందాలను ఆరబోస్తుంది కీర్తి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడొచ్చిన నైన్ మటకా సాంగ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది బాలీవుడ్ కోసం కీర్తి ఏ రేంజ్‌లో రెచ్చిపోయిందో అని..! డెబ్యూ మూవీ బేబీ జాన్‌లో వరుణ్ ధావన్‌, కీర్తి సురేష్ మధ్య లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. మొదట్లో మొహమాటపడినా.. తర్వాత ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా తెలుగులో ఈమె ఏ సినిమాలు సైన్ చేయట్లేదు. భోళా శంకర్ తర్వాత టాలీవుడ్ వైపు చూడట్లేదు కీర్తి. ఈమె తీరు చూస్తుంటే.. బాలీవుడ్ కోసం తెలుగు ఇండస్ట్రీకి బైబై చెప్పేలా ఉన్నారు.