Tollywood: బాలీవుడ్ మోజులో తెలుగు సినిమాలకు దూరం..పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ.. ఈ హీరోయిన్ను గుర్తు పట్టారా?
పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. కుర్రాళ్ల కలల రాణి. అయితే బాలీవుడ్ పై మోజుతో తెలుగు సినిమాలకు దూరమైంది. అయితే అక్కడా సక్సెస్ కాలేదు. దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా తయారైందీ ముద్దుగుమ్మ పరిస్థితి.
పై ఫొటోలో ఉన్న అమ్మాయి ఒకప్పుడు తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. తెలుగులో అయితే మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇక తమిళ్ లో విజయ్ దళపతి తదితరులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఆమె కెరీర్ పీక్ స్టేజ్ కు వెళ్లింది. అయితే ఇదే సమయంలో ఈ అందాల తార చేసిన ఒక తప్పు తన సినిమా కెరీర్ ను డోలాయమానంలో పడేసింది. బాలీవుడ్ పై మోజుతో అక్కడి కెళ్లిన ఈ బ్యూటీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా వరుసగా ప్లాఫ్ లు ఎదుర్కొంది. దీంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకే దూరమైపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితం కూడా సంచలనమే. పెళ్లి కాకుండానే గర్భం ధరించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా భర్త, బిడ్డే లోకంగా బతుకుతోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ఇలియానా. శుక్రవారం (నవంబర్ 01) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఇలియానాకు బర్త్ డే విషెస్ చెప్పారు.
గోవాలో పుట్టి పెరిగిన ఇలియానా 2003లో మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పలు యాడ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక దేవ దాసు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే తన అందచందాలతో కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టేసింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో ‘పోకిరి’ చేసింది. దీంతో ఇలియానా పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. దీని తర్వాత జల్సా, కిక్, జులాయి.. సినిమాలు చేసింది. అయితే తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ వైపు తొంగి చూసింది. కానీ అక్కడ ఆమెకు అసలు లక్ కలిసి రాలేదు. రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. కానీ అప్పటికే ఆమె క్రేజ్ బాగా తగ్గిపోయింది. 2018లో రవితేజతో కలిసి నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక 2023 మేలో మైఖేల్ డోలన్ ని పెళ్లి చేసుకుంది ఇలియానా. ఆగస్టులో ఈ దంపతులకు ఒక మగ బిడ్డ పుట్టాను.దీంతో పెళ్లికి ముందే ఇలియానా గర్భం ధరించిందని ప్రచారం సాగింది.
కుమారుడితో ఇలియానా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.