Horror Movie OTT: వణుకుపుట్టించే సీన్స్.. ఊహించని ట్విస్టులు.. భయపెట్టే హారర్ మిస్టరీ సినిమా..

ఈమధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువగా హారర్ మూవీ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషలలోనే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ కంటెంట్ చిత్రాలు కూడా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి వస్తున్నాయి.

Horror Movie OTT: వణుకుపుట్టించే సీన్స్.. ఊహించని ట్విస్టులు.. భయపెట్టే హారర్ మిస్టరీ సినిమా..
A Classic Horror Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2024 | 6:08 PM

హారర్ మూవీ లవర్స్ కోసం ఇప్పుడు ఓటీటీ మేకర్స్ ఎక్కువగా హారర్ థ్రిల్లర్ మూవీస్ తీసుకువస్తున్నారు. నిజానికి ఈ జానర్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సస్పెన్స్ థ్రిల్లింగ్, మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కాలంలో మిస్టరీస్, ఊహించని ట్విస్టులతో సాగే సస్పెన్స్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. నెల తిరక్కుండానే ఇటు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందులో ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. అదే ఏ క్లాసిక్ హారర్ స్టోరీ. 2021 జూలై 14న నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు రాబర్డ్ డెఫియో, పాలో స్ట్రిప్పోలి ఇద్దరు దర్శకత్వం వహించారు.

నలుగురు ఫ్రెండ్స్ కారులో అడవిలో వెళ్తుండగా దారిలో ఓ చెట్టుకుని వారి కారు ఢీకొట్టి ప్రమాదం జరిగింది. ఆ పక్కనే వారికి ఒక ఇల్లు కనిపించడంతో అందులోకి వెళ్లిపోతారు. అక్కడ కళ్లు, చెవులు, నోరు లేని బొమ్మల ముందు కొందరు మనుషుల అవయాలు పెట్టి.. పూజలు చేసినట్లుగా కనిపిస్తాయి. బొమ్మలకు మనుషుల అవయవాలు పెట్టి పూజలు చేసి వారిని తిరిగి బతికించేందుకు చేసే పూజలు అని.. అందుకు మూల్యం చె్లలించుకోవాల్సి ఉంటుందని అక్కడ రాసి ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న సీన్స్ చూసి ఆ నలుగురు వణికిపోతారు. ఆ తర్వాత వారిలో నుంచి ఒక్కొక్కరు మిస్ అవుతుంటారు.

ఆ నలుగురిని కొందరు ముసుగేసుకున్న వ్యక్తులు అతి కిరాతకంగా వెంటాడి చంపుతుంటారు. ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్.. ఆద్యంతం ఆసక్తిని కలిగించే ఈ హారర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటాలియన్ తోపాటు మరికొన్ని విదేశీభాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.