AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి తెలుగు సైకో థ్రిల్లర్ మూవీ.. ఊహించని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?

ఇతర జానర్లతో పోల్చుకుంటే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఓటీటీలో ఎక్కువ ఆదరణ ఉంటుంది. థియేటర్లలో ఆకట్టుకోకపోయినా ఈ జానర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ పై మాత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటాయి. అలా ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు ఓ తెలుగు సైకో థ్రిల్లర్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది.

OTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి తెలుగు సైకో థ్రిల్లర్ మూవీ.. ఊహించని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 01, 2024 | 7:36 PM

Share

ప‌లాస 1978 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. ఈ సినిమాలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. పలాస తర్వాత నరకాసుర వంటి డిఫరెంట్ మూవీలో నటించాడు రక్షిత్. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా బాగుందని ప్రశంసలు వచ్చాయి. వీటి తర్వాత ‘ఆపరేషన్ రావణ్’ అంటూ మరో సినిమాతో మన ముందుకు వచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో. హీరో రక్షిత్ తండ్రి వెంకట్ సత్య స్వయంగా ఈ ఇంటెన్స్ సైకో థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఈ ఏడాది జూలై 26న తెలుగు తో పాటు తమిళ భాషల్లోనూ ఒకేసారి రిలీజైన ఆపరేషన్ రావణ్ యావరేజ్ గా నిలిచింది. సైకో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఆకట్టుకున్నా పెద్దగా ట్విస్టులు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. దీంతో ఆపరేషన్ రావణ్ ఓ మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది. థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఆపరేషన్ రావణ్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఆపరేషన్ రావణ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ పై ఒక అప్డేట్ వచ్చింది. శనివారం (నవంబర్ 2) నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుందన్న మాట. ఈ మేరకు ఆపరేషణ్ రావణ్ ఓటీటీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది.

ధ్యాన్‌ అట్లూరి నిర్మాతగా వ్యవహరించిన ఆపరేషన్ రావణ్ మూవీలో సంగీర్తన విపిన్‌ కథానాయికగా నటించింది. ఆమని, ర‌ఘు కుంచే, రాధికా శ‌ర‌త్‌కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితర సీనియర్ నటీనటులు కీల‌క పాత్ర‌ల్లో మెరిశారు. ఆప‌రేష‌న్ రావ‌ణ్ సినిమాకు శ‌ర‌వ‌ణ వాసుదేవ‌న్ మ్యూజిక్ అందించాడు.నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. . మరి థియేటర్లలో ఆపరేషన్ రావణ్ సినిమాను మిస్ అయ్యారా? అయితే మరికొన్ని గంటలు ఆగండి. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ఛాయిస్.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ రావణ్ మూవీ ప్రమోషన్లలో హీరో రక్షిత్ అట్లూరి..

&

ఆపరేషన్ రావణ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్