Vikatakavi: ఓటీటీలోకి తొలి తెలంగాణ డిటెక్టివ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే
సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ త్వరలోనే ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగాజీ 5 ‘వికటకవి’ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
వైవిధ్యమైన కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు డిఫరెంట్ కథలను అందించడంలో ముందుంటోన్న వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5. ఈ మాధ్యమం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ త్వరలోనే ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగాజీ 5 ‘వికటకవి’ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కారణాలతో అమరగిరి ప్రాంతంలోని సమస్యను గుర్తించటానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. తన తెలివి తేటలతో ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను అతను వెలికితీస్తాడు.
ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమరిగిరి ప్రాంతంతో రామకృష్ణకు ఉన్న అనుబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు మేకర్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.