Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసి అవమానించిన సినిమా ఇదే.. క్షమాపణలు చెప్పిన మేకర్స్!

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా సినిమా క. దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్ 31)న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కిరణ్ అబ్బవరం కొందరు తనను కావాలని టార్గెట్ చేశారంటూ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసి అవమానించిన సినిమా ఇదే.. క్షమాపణలు చెప్పిన మేకర్స్!
Kiran Abbavaram
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2024 | 4:53 PM

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి మూవీ యూనిట్ ను మెచ్చుకుంటున్నారు. సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు గా నటించారు. అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ‘మీ సినిమాల్లో నన్ను ట్రోలింగ్ చేసే అంతగా ఏం చేశాను మీకు నేను?’ అంటూ కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యాడు. ‘గతంలో నేను చేసిన కొన్ని సినిమాలు డీసెంట్ గా ఉన్నాయి, మరికొన్ని ప్లాఫ్ అయ్యాయి. హిట్స్ ఫ్లాప్ అనేవి ఇండస్ట్రీలో కామన్. కానీ నా బాధ అది కాదు. నేను ఏదో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను. నా పని నేను చేసుకుంటూ వెళుతున్నాను. అలాంటిది నాపై సినిమాల్లో ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా రిక్వెస్టింగ్ గానే అడుగుతున్నాను. నామీద ఎందుకు ఇదంతా… మిమ్మల్ని ఏరోజైనా ఏమైనా అడిగానా.. సినిమాలో నామీద డైరెక్ట్ గా ట్రోలింగ్ ఎందుకు.. కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అసలు నాతో ప్రాబ్లమ్ ఏంటి? నేను ఎదగకూడదా?’ అని భావోద్వేగానికి లోనయ్యాడు కిరణ్ అబ్బవరం.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం మాటలు ఆ ఈవెంట్ కు వచ్చిన నాగ చైతన్యతో పాటు అందరినీ కదిలించించాయి. విశ్వక్సేన్ లాంటి యంగ్ హీరోలు కిరణ్ అబ్బవరంకి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసిన ఆ సినిమా ఏంటి? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అలా సెర్చ్ చేయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఇంతకీ కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసిన సినిమా మరేదో కాదు ‘బాయ్స్ హాస్టల్’. దీంతో అతని అభిమానులు, నెటిజన్లు ‘బాయ్స్ హాస్టల్’ దర్శకనిర్మాతలపై మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఆ సినిమా నిర్మాతలు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

 వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
మహాకుంభమేళా.. అఘోరాలు, నాగసాధువుల ఆశీర్వాదం కోసం భక్తుల పోటీ
మహాకుంభమేళా.. అఘోరాలు, నాగసాధువుల ఆశీర్వాదం కోసం భక్తుల పోటీ
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే.
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే.
కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారా?..షాకింగ్ న్యూస్ మీకోసమే!
కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారా?..షాకింగ్ న్యూస్ మీకోసమే!
నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్‌ల సునామీ!
నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్‌ల సునామీ!
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!
అంతరిక్షంలో ఉపగ్రహాల గ్రాండ్‌ షేక్‌హ్యాండ్‌ విజయవంతం
అంతరిక్షంలో ఉపగ్రహాల గ్రాండ్‌ షేక్‌హ్యాండ్‌ విజయవంతం
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
AI తో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చా?
AI తో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చా?
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్