Aishwarya Rai Birthday : ప్రపంచంలోనే అందమైన స్త్రీ.. ఐశ్వర్య ఆస్తులు ఎంతో తెలుసా..? భర్త అభిషేక్ బచ్చన్ కంటే..

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు బీటౌన్ సినీ స్టార్స్, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఐశ్వర్యకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ పంచుకుంటున్నారు అభిమానులు. అలాగే ఐశ్వర్య ఆస్తులకు సంబంధించిన వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి .

Aishwarya Rai Birthday : ప్రపంచంలోనే అందమైన స్త్రీ.. ఐశ్వర్య ఆస్తులు ఎంతో తెలుసా..? భర్త అభిషేక్ బచ్చన్ కంటే..
Aishwarya Rai
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2024 | 5:06 PM

ప్రపంచంలోనే అందమైన స్త్రీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఐశ్వర్య రాయ్. అందం, అభినయంతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నవంబర్ 1 ఐశ్వర్య రాయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 51 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో నెటిజన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. తమిళంలో అనేక హిట్ చిత్రాలతో సౌత్ అడియన్స్ మదిలో స్థానం సంపాదించుకుంది. 997లో ఔర్ ప్యార్ హో గయా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. 27 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఐశ్వర్య వందలాది సినిమాల్లో నటించి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.

కొన్నాళ్లుగా ఐశ్వర్య సినిమాల్లో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే పలు మూవీ ఈవెంట్స్, బాలీవుడ్ పార్టీలలో సందడి చేస్తుంటుంది. సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఐశ్వర్య రాయ్ ఏడాదికి రూ.1 కోటికి పైగా సంపాదిస్తుంది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఐశ్వర్య ఒకరు. అంతేకాదు ఐశ్వర్య సంపద ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కంటే ఎక్కువ. . బాలీవుడ్ లైఫ్ ప్రకారం ఐశ్వర్యరాయ్ నికర విలువ రూ.800 కోట్లు. అభిషేక్ నికర విలువ 280 కోట్లు.

పలు నివేదికల ప్రకారం ఐశ్వర్య రాయ్ తన సినిమాలకు భారీ మొత్తంలో వసూలు చేస్తుంది. ఒక్క సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అలాగే ఇప్పటివరకు ఎన్నో బ్రాండ్స్ కు ఆమె అంబాసిడర్. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి కూడా బాగా సంపాదిస్తుంది. ఆమె రోజుకు దాదాపు 6 నుండి 7 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే అమె చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2021లో, ఆమె పోషకాహార సేవల కంపెనీలో సుమారు రూ. 5 కోట్ల పెట్టుబడి పెట్టింది. అంతకుముందు, ఆమె బెంగళూరులోని ఎన్విరాన్‌మెంటల్ స్టార్టప్‌లో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టింది.

ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా ఐశ్వర్య రాయ్ పర్సనల్ విషయాల గురించి నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది. ఐశ్వర్య ఆమె భర్త అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే కొన్ని రోజులుగా ఐశ్వర్య ఆమె కూతురు ఆరాధ్యతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారని ప్రచారం నడుస్తుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!