Raviteja : రవితేజ పక్కన హీరోయిన్ అన్నారు.. కట్ చేస్తే.. రాత్రికి రాత్రే మార్చేశారు.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..
మాస్ మహారాజా రవితేజ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చి రాత్రికి రాత్రే చేజారిపోవడంపై బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో తీవ్రంగా బాధపడి ఏడ్చానని తెలిపిన ఆమె, సినీ పరిశ్రమలో ఎన్ని సవాళ్లు ఎదురైనా పట్టుదలతో ముందుకెళ్తూ పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్ చేయడమే తన లక్ష్యమని వెల్లడించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్నప్పటికీ, సరైన అవకాశాల కోసం అడుగులు వేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నటీనటులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. అటు గ్లామర్‌తో పాటు ఇటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్న తెలుగు బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య. మహర్షి సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. హౌస్ లో ఉన్నది తక్కువ సమయమే అయినప్పటికీ అమాయకత్వంతోపాటు ఆట తీరుతో మెప్పించింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. ఇదిలా ఉంటే దివి తాజాగా తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో తనకు మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్‌గా నటించే మంచి అవకాశం వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల రాత్రికి రాత్రే ఆ ఛాన్స్ చేజారిపోయిందని ఆమె వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి, తన సినీ జీవితంలో ఎదురైన మలుపులను గుర్తుచేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తనకు ఎంతో సపోర్ట్ చేశారని, ఆయన తనకు ఒక గురువులాంటి వారని తెలిపారు. అలాగే ఇండస్ట్రీలో తనకు మంచి స్నేహితుడు అని తెలిపారు. బిగ్ బాస్ తర్వాత డిజిటల్ మాధ్యమాల్లోనూ, పలు వెబ్ సిరీస్‌లలోనూ తనకంటూ మంచి గుర్తింపు దక్కడానికి ఇలాంటి ప్రముఖుల ప్రోత్సాహమే కారణమని చెప్పారు. అయితే, రవితేజ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చిన సమయంలో ఆనందపడిన క్షణాల గురించి చెబుతూ.. చివరి నిమిషంలో అనూహ్యంగా తనను ఆ పాత్ర నుంచి తొలగించారని తెలిపారు. ఆ రాత్రి తాను ఎంతో బాధపడి ఏడ్చానని, ఆ అనుభవం తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..
అయినప్పటికీ వెనుకంజ వేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకుసాగుతున్నానని దివి స్పష్టం చేశారు. పెద్ద సినిమాలలో లీడ్ రోల్స్ చేయాలనే బలమైన కోరిక తనకు ఉందని, దర్శకులు కోరిన విధంగా తన పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో నటిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..
దివి వైద్య..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..
