అందంలో అప్సరస.. అభినయంతో కట్టిపడేసే క్యూటీ 

26 October 2026

Rajeev 

బంధవి శ్రీధర్.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. హీరోయిన్‌గా బిజీ కావాలని చూస్తోంది.

బంధవి శ్రీధర్ చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తోంది. మిస్టర్ పర్ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్యా, మజ్ను వంటి సినిమాల్లో కనిపించింది.

2022లో విడుదలైన హారర్ థ్రిల్లర్ మసూదలో నజియా పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

అందంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇస్తూ మసూదలో తన పాత్రకు తగ్గట్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2019లో మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ వంటి టైటిల్స్‌తో బంధవి వార్తల్లో నిలిచింది.

ఫొటోషూట్లు, స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

తెలుగు సినిమాలతో పాటు 2024లో వచ్చిన తమిళ చిత్రం లైట్ హౌస్ లోనూ నటించి తన కెరీర్‌ను విస్తరించింది.

తన ఫొటోలు, ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులకు దగ్గరవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.