Tollywood : మంచి అమ్మాయిల ఉండి విసిగిపోయా.. కంఫర్ట్ జోన్ వద్దు.. టాలీవుడ్ హీరోయిన్..
హీరోయిన్ అంటే పాజిటివ్ రోల్.. పక్కా హీరోకు సపోర్టుగా.. అమాయకంగా మంచిగా కనిపించే అమ్మాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్ పాత్రలకు సైతం యాక్షన్ సీన్స్, రివేంజ్ సీన్స్ ఉంటున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు ఒక మంచి అమ్మాయిల ఉండి తనకు విసుగు వచ్చిందని అన్నారు.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ కృతి సనన్. తెలుగులో అంతగా కలిసిరాకపోయినప్పటికీ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు హిందీలో బ్యా్క్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది. తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ.. అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఇటీవల కరీనా హోస్ట్ చేస్తున్న వాట్ ఉమెన్ వాంట్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన కెరీర్ లో 20 చిత్రాలు చేసిన తర్వాత తను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుందో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
కంఫర్ట్ జోన్ నుండి బయటపడి, ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నావని కరీనా ఆమెను అడగగా, దీనికి కృతి స్పందిస్తూ, తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు, తనకు ఆఫర్ చేసిన కొన్ని పాత్రలలో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడంపై చాలా శ్రద్ధ పెట్టేదాన్నని చెప్పింది. “అద్భుతమైన అవకాశాలన్నీ ఒకేసారి రావు. చాలా కాలం పాటు, అంతా మంచి అమ్మాయి పాత్రలే. చాలా కాలంగా స్త్రీని పురుషుల దృష్టితోనే చూస్తున్నారు. అంటే ‘సతీ సావిత్రి’, సిగ్గరి, మొహమాటపడే, పోకిరీల నుండి కాపాడబడాల్సిన, ఎప్పుడూ తప్పు చేయని అమ్మాయి.ప్రజలు ఇప్పుడు మరింత వాస్తవికమైన, మానవీయమైన పాత్రలను రాస్తున్నారంటే చాలా ఉత్సాహంగా ఉంది. మానవత్వం, మంచి అమ్మాయి పాత్రలు చేసి నాకు చాలా విసుగొచ్చింది. నిజ జీవితంలో నేను ఎలాగు మంచి అమ్మాయినే” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేసింది. గ్లామర్ పాత్రలతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
కృతి సనన్ పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..
