AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడు లేని గుడి.. అద్భుత శిల్పకళతో ఆకట్టుకునే ధర్మాబాద్ ఆలయం వెనుక ఆసక్తికర చరిత్ర!

దేవాలయం అంటేనే దైవం కొలువై ఉండే పవిత్ర ప్రదేశం. కానీ ఓ ఆలయం మాత్రం అందుకు భిన్నం. అద్భుతమైన శిల్పకళ.. ఆకట్టుకునే గోపురం.. విశాలమైన మండపం.. దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు.. ఇలా అన్ని హంగులతో నిర్మించిన ఈ ఆలయంలో మాత్రం దేవతా విగ్రహం లేదు. అమ్మవారి ప్రతిష్ఠాపన కోసం నిర్మించిన ఈ గుడి.. నేడు దేవుడు లేని గుడిగా మిగిలిపోయింది. దీని వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 2:14 PM

Share

1 / 5
పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మాబాద్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడి చరిత్ర తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న రాఘవాపురం గ్రామానికి వెళ్లాల్సిందే. ఒకప్పుడు రాఘవాపురం కేంద్రంగా సంస్థానాధీశుడిగా వ్యవహరించిన లక్ష్మీకాంతారావు హయాంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. రాఘవాపురంలోని రంగనాయక స్వామి ఆలయానికి అనుబంధంగా వందల ఏళ్ల క్రితం ఈ గుడిని నిర్మించినట్లు తెలుస్తోంది.

2 / 5
ఈ ఆలయంలో ఆండాళమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని లక్ష్మీకాంతారావు, ఆయన తండ్రి సంకల్పించారు. అంతేకాదు.. రంగనాయక స్వామి ఆలయం నుంచి ఆండాళమ్మ ఆలయం వరకు రోప్‌వే నిర్మించాలనే ఆలోచన కూడా చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ఇంజనీర్లను పిలిపించాలని ప్రయత్నించినట్లు చెబుతారు. అయితే ఇంజనీర్లు రాకపోవడంతో రోప్‌వే నిర్మాణం ముందుకు సాగలేదు. మరోవైపు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరగలేదు. ఆ తర్వాతి కాలంలో సంస్థానాధీశుల వారసులు సైతం ఈ విషయంపై దృష్టి సారించకపోవడంతో ఆలయం అసంపూర్తిగానే మిగిలిపోయింది.

3 / 5
కాలం గడిచినా ఆ ఆలయ నిర్మాణ వైభవం మాత్రం చెక్కుచెదరలేదు. అందమైన గోపురం, శిల్పకళా నైపుణ్యంతో కూడిన కట్టడాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గోపురంపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివాహ వేడుక, పట్టాభిషేక మహోత్సవం వంటి ఘట్టాలను శిల్పాల రూపంలో తీర్చిదిద్దారు. ప్రధాన గోపురంపై ఆండాళమ్మ అమ్మవారి ప్రతిమను కూడా చెక్కించారు.

4 / 5
గర్భగుడికి ఇరువైపులా దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, అందమైన మండపం ఉన్నాయి. ఆలయానికి కొంతదూరంలో విశాలమైన స్వాగత తోరణం సైతం నిర్మించారు. స్థానిక సర్పంచ్ చొరవతో ఆలయ పరిసరాలను పార్కు తరహాలో అభివృద్ధి చేశారు. దీంతో ఒకప్పుడు నిరుపయోగంగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు సందర్శకులను ఆకర్షిస్తోంది. ఫొటోషూట్లతో పాటు కళాకారుల షూటింగ్‌లకు వేదికగా మారింది.

5 / 5
Follow Us