Actor Fitness : 64 ఏళ్ల వయసులో పాతికేళ్ల ఫిజిక్.. కుర్ర హీరోలకు షాకిస్తున్న స్టార్ హీరో ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
ప్రస్తుతం సినీరంగంలో స్టార్ హీరోహీరోయిన్స్ ఫిట్నెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆరు పదుల వయసులోనూ పాతికేళ్ల యూత్ లా కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు సెలబ్రెటీల ఫిట్నెస్, డైట్ సీక్రెట్ తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో డైట్ విషయం నెట్టింట తెగ వైరలవుతుంది. 64 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు షాకిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే..

హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో, తన వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా, ఫిట్‌గా మారుతుండటం విశేషం. ప్రస్తుతం ఆయన వయసు 64 ఏళ్లు అయినప్పటికీ, తెరపై ఆయన చేసే సాహసాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యపోవాల్సిందే. పాతికేళ్ల కుర్ర హీరోలను సైతం వెనక్కి నెట్టేలా ఆయన మెయింటైన్ చేస్తున్న ఈ అమేజింగ్ ఫిట్‌నెస్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. టామ్ క్రూజ్ తన ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ రాజీపడరు. కేవలం జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్లు చేయడం మాత్రమే కాకుండా, వివిధ రకాల శారీరక శ్రమలను తన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటారు. వెయిట్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలతో పాటు రన్నింగ్, హైకింగ్, స్కై డైవింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహసోపేతమైన అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో చురుగ్గా పాల్గొంటారు. ఇలా రకరకాల క్రీడలు ఆడటం వల్ల శరీరంలోని ప్రతి కండరానికి సరైన వ్యాయామం అందుతుంది. అంతేకాకుండా అతడు ఇఫ్పటికీ ఎక్కువగా పరిగెత్తడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే అతడు ఎప్పుడూ తన వెంట పెయిన్ కేవ్ అని పిలిచే సొంత పోర్టబుల్ జిమ్ వెంటే పెట్టుకుంటాడు. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి తన చేతులను ఎక్కువ సేపు పైకి పట్టుకుని కోర్ స్ట్రెంగ్త్, స్టామినాపై ఫోకస్ చేస్తుంటాడు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
ఇక డైట్ విషయంలోనూ ఆయన చాలా కఠినమైన నియమాలను పాటిస్తారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటారు. కేవలం తాజా కూరగాయలు, లీన్ ప్రొటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉండేందుకు తక్కువ పరిమాణంలో రోజూ ఐదుసార్లు పోషకాహారం తీసుకునే అలవాటు ఆయనకుంది. అలాగే సీన్స్ షూట్ చేసేముందు తాను కచ్చితంగా పుష్కలంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తారట. చలి, ఎత్తైన ప్రదేశాల్లో షూటింగ్స్ ఉన్న సమయంలో అతడు సాసేజ్, దాదాపు డజను గుడ్లు, బేకన్ టోస్ట్, కాఫీ, డ్రింక్స్ తీసుకుంటానని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..
అతడు దాదాపు 150-300 నిమిషాలపాటు వ్యాయమం చేస్తారట. మానసిక ప్రశాంతత, నిద్ర కూడా ఆయన ఫిట్‌నెస్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తగినంత నిద్రపోయేలా చూసుకుంటారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ, నిరంతరం శారీరక దృఢత్వంపై శ్రద్ధ పెట్టడమే టామ్ క్రూజ్ సక్సెస్ సీక్రెట్!
ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..
టాప్ క్రూజ్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..
