Vijay Rashmika : మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం.. రష్మికతో బ్యూటీఫుల్ వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఇటీవలే వీరిద్దరు కలిసి నటించిన రణబాలి చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 9 షోలో పాల్గొన్న విజయ్, రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుర్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఇటీవల వీరిద్దరు కలిసి నటించిన సినిమా రణబాలి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కొద్ది రోజుల క్రితం కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో విజయ్ మాట్లాడుతూ తమ ప్రేమ, పెళ్లి గురించి చెబుతూ అలాగే రష్మిక తనకు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసింది అనే విషయాన్ని వెల్లడించారు. అయితే విజయ్ మాట్లాడిన మాటలు పూర్తిగా కాకుండా ఒక చిన్న క్లిప్ మాత్రమే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. దీంతో విజయ్ చేసిన కామెంట్స్ నెటిజన్స్ తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో రష్మికతో తనకున్న బాండింగ్ గురించి చెబుతూ బ్యూటీఫుల్ వీడియో షేర్ చేశారు విజయ్. ప్రస్తుతం తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
“నా ప్రాణ స్నేహితురాలు, నా భార్య, నా ప్రియురాలు. నా జీవితంలో నేను సంపూర్ణంగా సరిగ్గా పొందిన అత్యంత అందమైన భాగాలలో ఒకటి. మా పట్ల బాధ్యత వహించే వారికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. మీ ప్రేమకు నేను ధన్యుడను. అయితే మీరు అనుకుంటున్న ఈ ప్రపంచానికి మేము వ్యతిరేకంగా ఉన్నామనుకుంటే అలాగే కానివ్వండి. ప్రేమను, సంతోషంగా జీవించడంలో ఉన్న సరళతను ఆస్వాదించేవారికి హృదయపూర్వక ధన్యవాదలు. ఇప్పుడు ఎలాంటి గౌరవం, దయ లేకుండా చెబుతున్నారు. ఇక మిగత వాళ్లందరూ ఏమైనా అయిపోవచ్చు” అంటూ రష్మికను విపుపై ఎక్కించుకుని తిరుగుతున్న వీడియో షేర్ చేశాడు విజయ్.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..
మరోవైపు రష్మిక సైతం విజయ్ గురించి విమర్శలపై స్పందించింది. “విజయ్‌తో పెళ్లి విషయంలో ఇద్దరం ఒకరినొకరం ఎంచుకున్నాం! విజయ్‌కు సమయం కావాలనడంలో తప్పేముంది? మా ప్రేమను ప్రపోజల్స్‌తో కొలవలేరు! విజయ్‌పై పిచ్చి ప్రేమ ఉంది.. అందులో తప్పేముంది? పెళ్లి చేసుకునే వ్యక్తిని ప్రేమించకపోతే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? విజయ్ నా స్నేహితుడు.. నా జీవిత భాగస్వామి! మా వ్యక్తిగత జీవితంపై అనవసరమైన వ్యాఖ్యలు వద్దు!” అంటూ చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..
విజయ్ దేవరకొండ..
View this post on Instagram
రష్మిక పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..
