AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరె.. ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. మంచి పెయింటర్ కూడా

ఈ టాలీవుడ్ హీరోయిన్ ను మల్టీ ట్యాలెంటడ్ అనొచ్చు. ఎందుకంటే యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లోనూ ఇరగదీస్తోందీ అందాల తార. కథక్, హిప్ హాప్, వాకింగ్, బెల్లీ డ్యాన్స్ లలో శిక్షణ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి పెయింటర్ కూడా..

Tollywood: అరె.. ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. మంచి పెయింటర్ కూడా
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 04, 2025 | 11:38 AM

Share

పై ఫొటోలో కనిపిస్తోన్న స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. హైదరాబాద్‌లోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఆసక్తి. ముఖ్యంగా నృత్యం అంటే మక్కువ. స్కూల్ డేస్ లోనే పలు డ్యాన్స్ కాంపీటీషన్లలో పాల్గొని సత్తా చాటంది. దీంతో నృత్యం పట్ల ఉన్న మక్కువను చూసి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని షియామక్ దావర్ డ్యాన్సింగ్ స్కూల్ లో చేర్చారు. ఈ క్రమంలోనే కథక్, హిప్ హాప్, వాకింగ్, బెల్లీ డ్యాన్స్ తదితర వాటిల్లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇక సినిమాల్లోకి రాకముందు ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. 50 కి పైగా తెలుగు భాషా నాటక నిర్మాణాలలో భాగమైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని లయోలా అకాడమీ డిగ్రీ పీజీలో గ్రాడ్యుయేషన్ వేడుకల్లో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ బ్యూటీని చూశాడట. ఆ వెంటనే తన సినిమా ఆడిషన్ కు పిలిచారట. ఆ వెంటనే తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం కల్పించారట. ఇంతకీ ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? తను మరెవరో కాదు జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.

జాతి రత్నాలు సినిమాలో ఫరియా నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, బంగర్రాజు, రావణాసుర సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో సందడి చేసింది. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, ఆ ఒక్కటి అడక్కు సినిమాలతో మరోసారి హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంది. ఇక మత్తు వదలరా 2 సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది చిట్టి. ఇందులో కామెడీ తోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఫరియా. ప్రస్తుతం వల్లి మెయిల్ అనే డార్క్ కామెడీ మూవీలో నటిస్తోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫొటో..

ప్రస్తుతం వల్లి మెయిల్ అనే డార్క్ కామెడీ మూవీలో నటిస్తోందీ అందాల తార. ఇందులో   విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య హీరోగా నటిస్తున్న ‘గుర్రం పాపిరెడ్డి’ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా చేస్తోంది.

ఫరియా అబ్దుల్లా డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.