HIT 3 Movie Collections: హిట్ 3 బాక్సాఫీస్ సంచలనం.. ఆ రికార్డుకు చేరువలో నాని.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే..
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా హిట్ 3. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మే 1న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు భారీ వసూళ్లతో సత్తా చాటుతుంది. తాజాగా హిట్ 3 మూడు రోజుల కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న సినిమా హిట్ 3. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో వచ్చిన ఈసినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో నాని సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు భారీ వసూళ్లతో సత్తా చాటుతుంది. మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు వీకెండ్ లోనూ మరో సెన్సేషన్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత రెండో రోజు సైతం దూసుకుపోయింది. తాజాగా మూడు రోజుల వసూళ్లను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. హిట్ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ షేర్ చేస్తూ లెక్కలు చెప్పారు మేకర్స్.
ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు రూ.43 కోట్లు.. రెండో రోజు రూ.19 కోట్లు రాబట్టగా.. మూడో రోజు రూ.20 కోట్లు వసూలు చేసింది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో హిట్ 3 కలెక్షన్స్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఈ సినిమాకు అడియన్స్ తాకిడి పెరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సోమవారం నాటికి ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
మొన్నటి వరకు పక్కింటి అబ్బాయిగా ఫ్యామిలీ డ్రామా చిత్రాలతో అలరించిన నాని.. మొదటిసారి మోస్ట్ వయెలెన్స్ హీరోగా రఫ్పాడించారు. అర్జున్ సర్కార్ లాంటి వైవిధ్యమైన పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు అంచనాలకు మించి రెస్పాన్స్ వస్తుంది. గతంలో వచ్చిన హిట్ , హిట్ 2 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
82+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 3 days ❤🔥
It's SARKAAR SHOW at the box office 💥💥
Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0jIt
A sensational Sunday loading with massive bookings all over. #BoxOfficeKaSarkaar pic.twitter.com/dsRvH3lpFG
— Wall Poster Cinema (@walpostercinema) May 4, 2025
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




