AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: ఆ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం.. అసలు త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కుర్రహీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది త్రిష. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యా్డ్ అగ్లీ చిత్రాల్లో నటించి థియేటర్లలో సందడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీగా ఉంది.

Trisha: ఆ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం.. అసలు త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?
Trisha
Rajitha Chanti
|

Updated on: May 04, 2025 | 11:26 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో సత్తా చాటుతుంది. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో కుర్రహీరోయిన్లకు గుబులు పట్టిస్తోంది. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులోనూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటిస్తుంది. ఈరోజు (మే 4న) త్రిష పుట్టినరోజు. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో నెటిజన్స్, సినీతారలు బర్త్ డే విషెస్ తెలియజేస్తు్న్నారు. ప్రస్తుతం త్రిష వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా జీవిస్తుంది.

అయితే ఇప్పటికీ పెళ్లి మాటకు దూరంగా ఉంటుంది త్రిష. కానీ ఆమె పేరు చాలా మంది నటులతో ముడిపడి ఉంది. కానీ గతంలో వరుణ్ అనే వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం జరిగింది. 2015 జనవరి 23న ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దర ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పట్లో వీరి నిశ్చాతార్థం ఫోటోస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి పలు ఈవెంట్స్, పార్టీలలో పాల్గొన్నారు. కానీ వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. వీరిద్దరి బంధం మే నెలలో ముగిసింది.

అయితే వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు పలు తెరపైకి వచ్చాయి. వరుణ్ కుటుంబానికి వ్యాపార నేపథ్యం ఉంది. అతను ఒక నటిని వివాహం చేసుకోవడం అతని కుటుంబానికి ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. బిజినెస్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ అమ్మాయిని వారు కొరుకున్నారని.. కానీ త్రిష సినిమాలతో బిజీగా ఉండడంతో వీరి పెళ్లి ఆగిపోయిందని టాక్ నడిచింది. పెళ్లికి దూరంగా ఉన్న త్రిష.. ఇప్పటికీ అగ్ర కథానాయికగా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.4 నుంచి 5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..