Nagarjuna:నాగ్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ హీరో.. ఒకే ఏడాదిలో 8 సినిమాలు చేశాడండోయ్
ఇప్పటివరకు 50కు పైగా తెలుగు సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ హీరో. తన నటనా ప్రతిభకు ప్రతీకగా రెండు ఫిల్మ్ ఫేర్, ఒక నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. మొదట్లో తన కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించే ఈ హీరో ఇప్పుడు ఎక్కువగా సీరియస్ సబ్జెక్టులనే ఎంచుకుంటున్నాడు.

పై ఫొటోలో మన్మథుడు, హీరో అక్కినేని నాగార్జునతో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఒక దివంగత డైరెక్టర్ కమ్ నిర్మాత కొడుకు. ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరో. చెన్నైలో చదువు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తన నటనతో అందరి మన్ననలు అందుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఈ హీరో వేగంగా సినిమాలు చేశాడు. ఒక ఏడాది అతను నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయంటే ఈ హీరో గారి స్పీడ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేశాడీ ట్యాలెంటెడ్ హీరో. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అందులోనూ కెరీర్ ప్రారంభంలో తన కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన ఈ హీరో ఇప్పుడు సీరియస్ సబ్జెక్టులతో మన ముందుకు వస్తున్నాడు. విజయాలతో పాటు నటనా పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. మరి నాగ్ తో ఉన్న ఆ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు మన అల్లరి నరేష్.
దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారాయాన. అలా ఈవీవీ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా హలో బ్రదర్. ఇందులో నాగ్ డ్యూయల్ రోల్ పోషించాడు. ఆ సినిమా సెట్ లోనే సరదాగా నాగ్ ను కలిశాడు అల్లరి నరేష్. కాగా నాగార్జున, అల్లరి నరేష్ నా సామిరంగ సినిమాలో హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
భార్యతో అల్లరి నరేష్..
View this post on Instagram
గతేడాది అల్లరి నరేష్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి. అందులో బచ్చల మల్లి కమర్షియల్ గా విజయం సాధించకపోయినా నటనా పరంగా అల్లరి నరేష్ మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం సభకు నమస్కారం అనే సినిమాలో నటిస్తున్నాడు నరేష్.
రైల్వే కాలనీ సినిమాలో అల్లరోడు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.