Tollywood: బొద్దుగా ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? యూట్యూబర్ టు హీరో.. స్క్రీన్‌పై కనిపిస్తే నవ్వులే
పై ఫొటోలో బొద్దుగా కనిపిస్తోన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఆ పిల్లోడు టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ.. ఎంతలా అంటే స్క్రీన్ పై అతను కనిపిస్తే చాలు ఆటో మెటిక్ గా పెదాలపై నవ్వులు ప్రత్యక్షమవుతాయి. చాలా మందిలాగే ఒక యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు.
పై ఫొటోలో బొద్దుగా కనిపిస్తోన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఆ పిల్లోడు టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ.. ఎంతలా అంటే స్క్రీన్ పై అతను కనిపిస్తే చాలు ఆటో మెటిక్ గా పెదాలపై నవ్వులు ప్రత్యక్షమవుతాయి. చాలా మందిలాగే ఒక యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీడియోలు చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అదే పాపులారిటీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవ్వులు పంచాడు. స్టార్ హీరోలకు ఫ్రెండ్ గా నటించి సినీ ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇదే కోవలో హీరోగా మారి తన అదృష్టం పరీక్షించుకున్నాడు. తన ట్యాలెంట్ తెలిసి మాస్ మహరాజా రవితేజ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితేనేం ఈ నటుడి కామెడీ టైమింగ్ కు మరోసారి అందరూ ఫిదా అయ్యారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల ఈ నటుడు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాను షేర్ చేసిన ఒక పోస్టుకు నెటిజన్లు భిన్న రకాలుగా ఊహించుకుని ఈ డైవోర్స్ రూమర్స్ సృష్టించారు. అయితే అదేం లేదంటూ తన పర్సనల్ లైఫ్ పై వస్తోన్న పుకార్లకు స్వయంగా అతనే చెక్ పెట్టాడు. మరి ఈ టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు వైవా కాన్సెప్ట్ వీడియోలతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తిన వైవా హర్ష. ఇది అతని చిన్ననాటి ఫొటో. విడాకుల వార్తల నేపథ్యంలో హర్ష చిన్న నాటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వైవా హర్షగా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు హర్ష చెముడు. 2013లో మసాలా సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మైనే ప్యార్‌కియా, పవర్, గోవిందుడు అందరివాడేలే, సూర్య వర్సెస్ సూర్య, సైజ్ జీరో, దోచేయ్, శంకరా భరణం, జక్కన్న, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజా ది గ్రేట్, నక్షత్రం, జై లవకుశ, తొలి ప్రేమ, తేజ్ ఐ లవ్యూ, భానుమతి అండ్ రామకృష్ణ, కార్తికేయ 2, బింబిసార, బేబీ ఊరుపేర భైరవ కోన తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు.
View this post on Instagram
అలాగే సుందరం మాస్టర్ సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల రిలీజైన ప్రసన్న వదనం, ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లోనూ హర్ష కీలక పాత్రలు పోషించాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.