ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.? పేరు వింటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి

లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. లవ్ స్టోరీస్ లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. పక్కింటి కుర్రాడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునేలోగా ఊహించని సంఘటన జరిగింది. ఇంతకు ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.?

ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.? పేరు వింటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి
Hero
Follow us

|

Updated on: Jun 26, 2024 | 3:55 PM

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నోడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో స్టార్ హీరోగా మారాడు. లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. లవ్ స్టోరీస్ లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. పక్కింటి కుర్రాడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునేలోగా ఊహించని సంఘటన జరిగింది. ఇంతకు ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? ఆయన పేరు వింటేనే తెలియకుండా కన్నీళ్లు వస్తాయి. ఇంతకు ఆ కుర్రాడు ఎవరంటే..

దివంగత నటుడు ఉదయ్ కిరణ్.. ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు.. టాలీవుడ్ లో టాప్ హీరో అవుతాడు అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నేడు ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు ఉదయ్ కు విషెస్ తెలుపుతూ ఆయన ఫోటోలను షేర్ చేస్తున్నారు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత మరోసారి తేజ దర్శకత్వంలో నువ్వు నేను అనే సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నువ్వు నేను సినిమా అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత వరుసగా లవ్ స్టోరీలను చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఉదయ్. ఇక మనసంతా నువ్వే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ కూడా క్లాసిక్ హిట్ గా నిలిచింది.

ఇక ఉదయ్ కిరణ్ కు మెల్లగా ఆఫర్స్ తగ్గడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ ఆ కొంతకాలానికే ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం మాత్రం ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు. ఉదయ్ అకాల మరణం ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇప్పటికి ఆయనను గుర్తుచేసుకుంటూనే ఉంటారు అభిమానులు.

Uday Kiran

Uday Kiran

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..