Tollywood: ఆమె ఓ వాలు చూపు చూస్తే… విలవిలలాడతాయ్ కుర్రాళ్ల హృదయాలు.. ఈ ఎవర్‌గ్రీన్ బ్యూటీ ఎవరో కనిపెట్టారా..?
ఒకప్పుడు అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సహయనటిగా.. తల్లిగా కనిపిస్తూ మెప్పిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి. ఈరోజు (నవంబర్ 4) ఆమె పుట్టినరోజు కూడా.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ కథానాయికల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. త్రోబ్యాక్ ట్రెండ్ పేరుతో నటీనటుల బాల్యం జ్ఞాపకాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా హీరోహీరోయిన్స్ లేటేస్ట్ ఫోటోస్ హల్చల్ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. ప్రస్తుతం ఆమె వయసు 50 ఏళ్లు.. అయినా పెళ్లికి దూరంగా ఉంటూ సినిమా ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఒకప్పుడు అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సహయనటిగా.. తల్లిగా కనిపిస్తూ మెప్పిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి. ఈరోజు (నవంబర్ 4) ఆమె పుట్టినరోజు కూడా.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ కథానాయిక టబు. బజార్ అనే చిత్రంలో బాలనటిగా కనిపించిన ఆమె..ఆ తర్వాత రూప్ కీ రాణి చోరోంకా రాజా.. ప్రేమ్ చిత్రాల్లో హీరోయిన్గా నటిచింది. అయితే ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో టబుకు ఏమాత్రం కలిసిరాలేదు. ఆ తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కూలీ నెంబర్ 1 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టబు వరుస చిత్రాలతో బిజీ అయ్యింది. అటు హిందీలోనూ వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సిసింద్రీ, నిన్నే పెళ్లడతా, ఆవిడా మా ఆవిడే, చెన్న కేశవరెడ్డి, అందరివాడు వంటి హిట్ చిత్రాల్లో నటించిన టబు.. ఇప్పుడు సహయ నటిగా నటిస్తోంది.




డైరెక్టర్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం చిత్రంలో బన్నీ తల్లిగా కనిపించింది టబు. ఇటీవల ఈ సినిమాకు ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్ అందుకుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




