Saami Saami Song: సామీ సామీ పాటకు అదరగొట్టిన చిన్నారి.. శ్రీవల్లి అయినా ఫిదా అవ్వాల్సిందే..
మీ సామీ.. శ్రీవల్లి, ఊ అంటావా మావ సాంగ్స్ ఏ రేంజ్లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ చిన్నారి సామీ సామీ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి ముఖ్యంగా ఉత్తారాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం సినిమా మాత్రమే కాకుండా ఇందులోని సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలు నెట్టంటి షేక్ చేస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా పుష్ప పాటలకు అద్భుతంగా స్టెప్పులేశారు. సామీ సామీ.. శ్రీవల్లి, ఊ అంటావా మావ సాంగ్స్ ఏ రేంజ్లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ చిన్నారి సామీ సామీ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.
ఓ పాఠాలకు చెందిన చిన్నారులు సామీ సామీ పాటకు తమై స్టైల్లో కాలు కదుపుతున్నారు. అయితే వేదికపై ఉన్న చిన్నారి సామీ సామీ పాటను ఆలపిస్తూ.. ఎంతో ఉత్సాహంగా మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఆ చిన్నారి అందంగా డాన్స్ చేస్తుండగా.. తనను అనుసరిస్తూ మిగతా పిల్లలు కూడా స్టైలీష్‌గా డాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. చిన్నారి డాన్స్ సూపర్.. అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీరు ఓసారి ఆ పాప డాన్స్ చూసేయ్యండి.




ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఐకాన్ స్టార్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాగా..త్వరలోనే రష్మిక జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఫహద్ ఫాజిల్, సునిల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




