Tollywood: నటుడు కృష్ణంరాజుతో ఉన్న ఈమె ఎవరో గుర్తుపట్టారా..? తెలుగునాట స్టార్ హీరోయిన్
ఆమె అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. చాలా ముద్దుముద్దుగా యాక్టింగ్ చేస్తుంది. ఎక్కువగా నటుడు వెంకటేష్ సరసన సినిమాలు చేసింది. ఎవరో కనిపెట్టారా..?

ఈ ఫోటోలో దివంగత నటుడు కృష్ణంరాజు ఎత్తుకున్న అమ్మాయి ఎవరో మీరు గుర్తించారా..? తెలుగువారి మనసుల్లో పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకున్న నటి. తెలుగునాట నిన్నటి తరం స్టార్ హీరోలు చిరు, నాగ్, వెంకీ మామ వంటి హీరోలతో ఆడిపాడింది. ఇంకో క్లూ ఏంటంటే.. ఆమె బాలనటిగా కెరీర్ ప్రారంభించి.. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే స్టార్ ఇమేజ్ దక్కించకుంది. ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ అయ్యింది. ఇంత ఇంట్రో ఇచ్చాం. అయినా గుర్తుపట్టలేకపోతున్నారా..? ఆమె ఫేస్ కట్స్ చూసైనా ఓ అవగాహనకు రాలేక పోతున్నారా..? ఇంకో క్లూ ఇస్తున్నాం. ఈసారి చెప్పకపోతే ఇక మీరు ఓడిపోయినట్లే. ఆమె మొన్నీమధ్య కూడా మన వెంకటేష్‌కు జోడిగా ఓ సినిమాలో నటించింది. ఆ.. ఇప్పుడు ఒక గెస్‌కి వచ్చేసినట్లు ఉన్నారు. మీ ఊహ కరెక్టే.. అందులో ఉన్నది సీనియర్ మీరోయిన్ మీనా.
మీనా తండ్రి తెలుగువారే.. తల్లి మలయాళీ. ఆమె జన్మించింది మాత్రం తమిళనాడులో. 1982లో బాలనటిగా కెరీర్ స్టార్ట్ మీనా.. 50కి పైగా సినిమాల్లో నటించారు. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర చేసిన ‘నవయుగం’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత ఆమెకు వరసగా మంచి సినిమాలు వచ్చాయి. దక్షిణాదిన అన్ని భాషల్లో అగ్ర హీరోల సరసన చేసుకుంటూ వెళ్లిపోయారు. సౌత్‌లో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. చంటి, సుందరకాండ, ‘సీతారామయ్యగారి మనవరాలు’, అల్లరి పిల్ల, రాజేశ్వరీ కళ్యాణం, మొరటోడు నా మొగుడు, అబ్బాయిగారు వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ప్రజంట్ చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు మీనా. 2009లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్‌ను పెళ్లాడింది మీనా. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. అంతా హ్యాపీస్ అనుకుంటున్న సమయంలో ఆమె జీవితంలో పెద్ద కుదుపు ఎదురయ్యింది. జూన్ నెలలో మీనా భర్త అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు మీనా. నటుడు కృష్ణంరాజు చనిపోయినప్పడు.. ఆయనతో తాను చిన్నప్పుడు నటించిన మూవీ స్టిల్ షేర్ చేసి.. నివాళులు అర్పించింది మీనా. ప్రజంట్ ఆ పిక్ వైరల్‌గా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




