Tollywood: భూటాన్‌లో మెడిటేషన్ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. సౌత్ అడియన్స్ ఫేవరెట్..
ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న హీరోయిన్ భూటాన్‌లో సందడి చేస్తుంది. అక్కడి అందమైన ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అక్కడ మెడిటేషన్ చేస్తోన్న పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా ?. తను సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అందం, అభినయంతో తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకుంది. కానీ ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. తన ఆరోగ్యం కోసం విదేశాల్లో చికిత్స తీసుకుంటుంది.

ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న హీరోయిన్ భూటాన్‌లో సందడి చేస్తుంది. అక్కడి అందమైన ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అక్కడ మెడిటేషన్ చేస్తోన్న పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా ?. తను సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అందం, అభినయంతో తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకుంది. కానీ ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. తన ఆరోగ్యం కోసం విదేశాల్లో చికిత్స తీసుకుంటుంది. తనే హీరోయిన్ సమంత. ఖుషి సినిమా తర్వాత మూవీస్ నుంచి బ్రేక్ తీసుకున్న సామ్.. ప్రస్తుతం విదేశాల్లో రెస్ట్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు అమెరికాలో మయోసైటిస్ చికిత్స తీసుకున్న సామ్.. ఇప్పుడూ భూటాన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఆరోగ్యంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. సినిమాలు, షూటింగులతో సమానంగా తన హెల్త్‌కి సంబంధించి కూడా కావల్సినంత సమయం కేటాయిస్తున్నారు. ఇప్పుడు భూటాన్‌లో ఉన్న సమంత.. హాట్‌స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
అనాదిగా భూటాన్‌లో పాటిస్తున్న ఆరోగ్య సంప్రదాయం ఇది. నదుల్లో ఉన్న రాళ్లను ఎర్రగా కాల్చి నీళ్లలో వేస్తారు. దీంతో రాళ్లల్లో దాగున్న అమూల్యమైన మినరల్స్ కరుగుతాయి. కెంపా అనే మూలికల్ని కూడా జతజేర్చి.. వాటిని హాట్‌టబ్స్‌లోకి చేరుస్తారు భూటానీయులు. ఆ వేడినీళ్ల తొట్టెలో గనుక స్నానం చేస్తే… వళ్లు నొప్పులు, కడుపునొప్పి, అలసట, ఎముకల బలహీనత అన్నీ మటుమాయమౌతాయ్ అంటూ భూటాన్ స్టోన్ బాత్‌ని ప్రమోట్ చేస్తోంది సమంత.
View this post on Instagram
ఇటీవలే క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స కూడా చేయించుకున్నారామె. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ… ఇలా ప్రపంచం మొత్తం చుట్టేస్తున్న సమంత.. ప్రస్తుతం భూటాన్‌లో బ్రేక్ తీసుకున్నారన్నమాట.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
