Tollywood: చిరునవ్వుల చిన్నారి కుర్రాళ్ల క్రష్.. అందాల రాశిని వరించిన అదృష్టం.. గుర్తుపట్టగలరా ?..
ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. అంతలోనే సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కొన్ని నెలలు ఇండస్ట్రీకి దూరంగా ఉండి.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో మళ్లీ బిజీ అయ్యింది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది.. అటు నెట్టింట అందాల రచ్చ చేస్తూ సెన్సెషన్ అవుతుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టరా ?.
పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి.. తెలుగు ప్రేక్షకులు సుపరిచితమే. అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ ఆమె నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు. చివరకు ఒకే ఒక్క మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. అంతలోనే సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కొన్ని నెలలు ఇండస్ట్రీకి దూరంగా ఉండి.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో మళ్లీ బిజీ అయ్యింది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది.. అటు నెట్టింట అందాల రచ్చ చేస్తూ సెన్సెషన్ అవుతుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టరా ?.. తనే హీరోయిన్ నభా నటేష్. నన్ను దోచుకుందువంటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అందం, అభినయంతో అలరించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సడెన్ గా సినిమాలకు దూరమైంది. అందుకు కారణం యాక్సిడెంట్ కావడమే అని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ జోడిగా స్వయంభు మూవీలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ సెట్ లో అడుగుపెట్టింది. అలాగే యంగ్ హీరో ప్రియదర్శి నటిస్తోన్న డార్లింగ్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నభా నటేష్, ప్రియదర్శి భార్యభర్తలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా తమ మూవీ ప్రమోషన్ భిన్నంగా చేశారు వీరిద్దరు . నెట్టింట డార్లింగ్ పదం మీద పెద్ద యుద్ధమే చేశారు.
తెలుగులోనే కాకుండా కన్నడలోనూ పలు సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది. అయితే నటనపరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో స్వయంభు, డార్లింగ్ చిత్రాల్లో మాత్రమే నటిస్తుంది. ఇక త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.