Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 20 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా.. ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇలా మారిపోయిందేంటి?

టాలీవుడ్ లో సత్తా చాటిన బాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందులో ఈ ముంబై ముద్దుగుమ్మ కూడా ఒకరు. హిందీ, బెంగాళీ సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ అందాల తార 20 ఏళ్ల క్రితమే ఒక తెలుగు సినిమాలో నటించింది.

Tollywood: 20 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా.. ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇలా మారిపోయిందేంటి?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jan 19, 2025 | 12:08 PM

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బ్యానర్ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు హిట్ సినిమాలను నిర్మించిన ఆయన ఇప్పుడు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాను కూడా రూపొందిస్తున్నారు. దీంతో పాటు వివిధ భాషల్లోనూ స్టార్ హీరోలు, హీరోయిన్లతో కలిసి సినిమాలు తీస్తున్నారు. అలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మల్టీ లింగ్వల్ మూవీ మాకాళి. హిందీలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, బెంగాళీ భాషల్లో కూడా విడుదల కానుంది. కాగా ఈ సినిమా ద్వారా ఓ క్రేజీ హీరోయిన్ తెలుగు ఆడియెన్స్ ను పలకరించనుంది. ఆమె పేరు రైమా సేన్. పేరు వింటే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ నితిన్ ధైర్యం సినిమా అంటే ఇట్టే గుర్తుకు వస్తుంది. తేజ తెరకెక్కించిన ఆ సినిమాలో తన అందం, అభినయంతో యూత్ ను కట్టిపడేసింది రైమా సేన్. అయితే ధైర్యం తర్వాత మరే తెలుగు సినిమాలోనూ ఈ బ్యూటీ నటించలేదు. కానీ హిందీ, బెంగాళీ భాషల్లో ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అలా రైమాసేన్ నటించిన తాజా చిత్రం మా కాళి. విజయ్‌ యెలకంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అభిషేక్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

కాగా రిలీజ్ కు ముందే మా కాళి సినిమా పలు అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది. గతేడాది గోవాలో జరిగిన 55వ ఇంటర్నేనేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) వేడుకల్లో ‘మా కాళి’ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్, గోవా రాష్ట్ర డీజీపీ అలోక్‌ కుమార్‌ ఈ ప్రీమియర్ష షోకు హాజరయ్యారు. సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డ్‌ను ‘మా కాళి’ చిత్రం దక్కించుకుంది. అలాగే ఈ సినిమాలో నటనకు గాను రైమాసేన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 1946 ఆగస్టు 16న కలకత్తాలో జరిగిన ఓ దారుణ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని మాకాళీ సినిమాను తెరకెక్కించారు

ఇవి కూడా చదవండి

రైమా సేన్ లేటెస్ట్ ఫొటోస్..

ధైర్యం తర్వాత రైమాసేన్ నేరుగా తెలుగులో నటించకపోయినా కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ ను పలకరించింది. వివేక్ అగ్నిహోత్రి ది వ్యాక్సిన్ వార్, అదా శర్మ ది బస్తర్.. నక్సల్ స్టోరీ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించిందీ అందాల తార. అయితే ఇప్పుడు మళ్లీ మాకాళీ అంటూ మరోసారి తెలుగు ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోందీ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి