AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bommarillu Movie: ఓడియమ్మా.. ఇరగదీసింది కదా.. బొమ్మరిల్లు బ్యూటీని ఇప్పుడు చూస్తే హార్ట్ ఎటాకే..

సినీప్రియులకు ఎప్పటికీ బోర్ కొట్టని సినిమాల్లో బొమ్మరిల్లు ఒకటి. అందమైన ప్రేమకథతోపాటు.. తండ్రికొడుకుల మధ్య ప్రేమానుబంధాన్ని.. గుండెలను హత్తుకునే ఎమోషనల్ సీన్స్ అడియన్స్ ను ఫిదా చేశాయి. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి.

Bommarillu Movie: ఓడియమ్మా.. ఇరగదీసింది కదా.. బొమ్మరిల్లు బ్యూటీని ఇప్పుడు చూస్తే హార్ట్ ఎటాకే..
Bommarillu
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2025 | 10:41 AM

Share

ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్ నటించిన చిత్రాల్లో బొమ్మరిల్లు ఒకటి. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ ఫీల్ గుడ్ మూవీ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2006లో విడుదలైన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సిద్ధార్థ్ హీరోగా నటించగా.. అతడి సరసన జెనీలియా కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో జయసుధ, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు కీలకపాత్రలు పోషించారు. సిద్ధార్థ్, జెనీలియా మధ్య వచ్చే సీన్స్, వీరిద్దరి జోడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ సినిమాలో కనిపించిన ఓ అమ్మాయి అప్పట్లో యూత్ క్రష్. ఇందులో కనిపించింది కాసేపు అయినా సినిమాలోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయే.

అదేనండి.. సిద్ధార్థ్ పెళ్లి చూపులకు వెళ్లడం.. టక టకా నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది కదా. ఆ అమ్మాయే. ఈ సినిమాలో సిగ్గుపడుతూ ఎంతో పద్దతిగా కనిపించి అట్రాక్షన్ అయ్యింది. ఆ అమ్మాయి మరెవరో కాదు.. నేహా బాంబ్. తెలుగులో నితిన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దిల్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అతడే ఒక సైన్యం, దుబాయ్ శీను, బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది. దిల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు సరైన క్రేజ్ రాలేదు.

తెలుగులోనే కాకుండా హిందీలో పలు సినిమాల్లో నటించింది నేహా. కానీ అక్కడ సైతం అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. రిషిరాజ్ ఝావేరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..