Tollywood: ఈ చిన్నోడికి డైరెక్టర్ రాజమౌళి అభిమాని.. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?
ఇటీవల అతడు నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. తన సహజ నటనతో ఏకంగా డైరెక్టర్ రాజమౌళిని ఫిదా చేశాడు. తన నటనకు జక్కన్న అభిమాని అయ్యాడు. ఆ కుర్రాడు నటించిన సినిమా ఇటీవల తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టగలరా..?
తొమ్మిదేళ్ల క్రితం ఓ యువకుడు ముంబైలోని సిటీ బ్యాంక్‌లో మంచి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. నటనపై ఆసక్తి.. అంతకు మించి కొత్తగా ఆలోచనలతో ఏదైనా చేయాలనకున్న అతడి పట్టుదల. సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం. దీంతో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించడం ప్రారంభించాడు. ఆ తర్వాత మెల్లగా వెబ్ సిరీస్ చేయడం స్టార్ట్ చేశాడు. కొన్నాళ్ల కష్టానికి ఈ ఏడాది ఫలితం దక్కింది. ఇటీవల అతడు నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. తన సహజ నటనతో ఏకంగా డైరెక్టర్ రాజమౌళిని ఫిదా చేశాడు. తన నటనకు జక్కన్న అభిమాని అయ్యాడు. ఆ కుర్రాడు నటించిన సినిమా ఇటీవల తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టగలరా..? అది కష్టమే.. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్లు ఆ చిన్నోడు టాలీవుడ్ హీరో కాదు.. కేరళ అబ్బాయి.. మలయాళీ ఇండస్ట్రీలో క్రేజీ హీరో. అతడే శ్యామ్ మోహన్. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ ప్రేమలు మూవీ నటుడు అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు.
ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన మలయాళీ చిత్రం ప్రేమలు సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు శ్యామ్ మోహన్. మొదట యూట్యూబ్ వెబ్ సిరీస్ పొన్ముట్ట ద్వారా దృష్టిని ఆకర్షించాడు. అతడు నటించిన షార్ట్ ఫిల్మ్ నైట్ కాల్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత 18 ప్లస్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీ తర్వాత మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన శ్యామ్ మోహన్..ప్రేమలు సినిమాలో ఆది పాత్రలో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఇటు తెలుగులోనూ రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాతో శ్యామ్ మోహన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా హీరోహీరోయిన్, శ్యామ్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమాలో ఆది పాత్రలో నటించిన శ్యామ్ మోహన్ తన ఫేవరేట్ నటుడు అని.. తన నటన, అల్లరి, రైటింగ్ తనకు చాలా బాగా నచ్చాయని డైరెక్టర్ రాజమౌళి గతంలో అన్నారు. ప్రస్తుతం శ్యామ్ మోహన్ శివకార్తికేయన్ నటిస్తున్న కొత్త తమిళ చిత్రంలో సాయి పల్లవికి సోదరుడిగా నటిస్తున్నాడు. అలాగే గోవింద్ గెట్ సెట్ బేబీ చిత్రంలో నటిస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.