- Telugu News Photo Gallery Cinema photos Adah Sharma latest mesmerizing pictures goes viral in social media
Adah Sharma: అందం ఈ వయ్యారిని పదిలంగా తన గుండెల్లో దాచుకోందేమో.. అదా శర్మ పిక్స్..
అదా శర్మ హిందీ మరియు తెలుగు సినిమాల్లో ప్రధానంగా కనిపించే భారతీయ నటి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.
Updated on: Jun 09, 2024 | 10:33 AM

11 మే 1992న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి S. L. శర్మ తమిళనాడుకి మధురైకి చెందిన బ్రాహ్మణుడు, ఇండియన్ మర్చంట్ నేవీలో కెప్టెన్‌గా ఉన్నారు.ఆమె తల్లి షీలా శర్మ, మలయాళీ మరియు కేరళలోని పాలక్కాడ్‌లోని నట్టుపురా స్థానికురాలు, భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి మరియు మల్లఖంబ యోగా అభ్యాసకురాలు.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ. తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. తర్వాత తెలుగులో వరస అవకాశలు అందుకుంది ఈ బ్యూటీ.

నితిన్ జోడిగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్, ఎక్సప్రెషన్స్ తో కుర్రాళ్లను కవ్వించింది ఈ భామ. ఆ తర్వాత అల్లు అర్జున్, సమంత జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ అఫ్ సత్యమూర్తిలో ఓ పాత్రలో కనిపించింది.

చివరిగా యంగ్ హీరో అడవి శేష్ నటించిన క్షణం అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో ఆకట్టుకుంది. ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఏ టాలీవుడ్ మూవీలోను కనిపించలేదు ఈ అమ్మడు.

2023లో విడుదలైన వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటవల బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమాలో ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ది గేమ్ ఆఫ్ గిర్గిట్ మూవీలో నటిస్తుంది.



















