AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: శ్రీదేవి, రజినీకాంత్‏తో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో.. ఫాలోయింగ్ ఏ రేంజ్‏లో ఉంటుంది..

ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. నిజానికి అతడు బాలీవుడ్ స్టార్ హీరో. కానీ దక్షిణాదిలోనూ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించాడు. అతడి సహజ నటనకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే వెండితెరపై అతడి కటౌట్.. యాక్షన్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఇప్పుడు అగ్రకథానాయికుడిగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.

Tollywood: శ్రీదేవి, రజినీకాంత్‏తో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో.. ఫాలోయింగ్ ఏ రేంజ్‏లో ఉంటుంది..
Actor
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2023 | 12:12 PM

Share

దివంగత హీరోయిన్ శ్రీదేవి, సూపర్ స్టార్ రజినీకాంత్‏తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఈ హీరోను గుర్తుపట్టారా ?.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. నిజానికి అతడు బాలీవుడ్ స్టార్ హీరో. కానీ దక్షిణాదిలోనూ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించాడు. అతడి సహజ నటనకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే వెండితెరపై అతడి కటౌట్.. యాక్షన్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఇప్పుడు అగ్రకథానాయికుడిగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ముఖ్యంగా భార్యతో విడాకులు.. ప్రముఖ సింగర్‏తో ప్రేమలో ఉండడంతో నిత్యం నెట్టింట ఏదోక న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. ఎవరో గుర్తుపట్టారా ?.. అతన మరెవరో కాదు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.

1986లో రజినీకాంత్ నటించిన భగవాన్ దాదా చిత్రంలో హృతిక్ రోషన్ బాలనటుడిగా కనిపించారు. ఈ సినిమాకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో రజినీకాంత్, దివగంత నటి శ్రీదేవి జంటగా నటించారు. హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో అమీషా పటేల్ కథానాయికగా నటించింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. హృతిక్ రోషన్ ‘ఖుద్గర్జ్’, ‘కోయిలా’, ‘కరణ్ అర్జున్’, ‘కింగ్ అంకుల్’ సహా మొత్తం 4 చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఈ సినిమాలన్నీ రాకేష్ రోషన్ దర్శకత్వం వహించినవే. ‘కహో నా…ప్యార్ హై’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందు హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో కనిపించాడు.

49 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్‏నెస్, స్టైలీష్ లుక్స్ తో బిగ్ స్క్రీన్ పై మాయ చేస్తుంటాడు హృతిక్. అందుకే అతడిని అభిమానులు ‘గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్’ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం అతడు ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..!
ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..!
థర్టీఫస్ట్‌ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా..కోర్టు మెట్లెక్కుతారా
థర్టీఫస్ట్‌ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా..కోర్టు మెట్లెక్కుతారా
బహుశా చరిత్రలో అత్యంత అందమైన దోపిడీ ఇదేనేమో!
బహుశా చరిత్రలో అత్యంత అందమైన దోపిడీ ఇదేనేమో!
ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్ 7-సీటర్ కారు..బెస్ట్ మైలేజీ
ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్ 7-సీటర్ కారు..బెస్ట్ మైలేజీ
చిన్న తప్పుతో 12 ఏళ్ల బాలుడి చేతిలో గుకేష్ ఘోర పరాజయం..!
చిన్న తప్పుతో 12 ఏళ్ల బాలుడి చేతిలో గుకేష్ ఘోర పరాజయం..!
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
కాలీఫ్లవర్ కొనడం ఒక కళ! పురుగులు లేని ఫువ్వును ఇలా గుర్తించండి..
కాలీఫ్లవర్ కొనడం ఒక కళ! పురుగులు లేని ఫువ్వును ఇలా గుర్తించండి..