Tollywood : బ్యాడ్మింటన్ మెడల్ అందుకుంటున్న ఈ హీరో ఎవరో తెలుసా ?.. ఆ స్టార్ హీరోకు దగ్గరి బంధువు…
ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న పాత్రలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ హీరోగానే కాదు.. అతడు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఈ విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు దగ్గరి బంధువు. త్వరలోనే ఈ స్టార్ హీరో తనయుడు కూడా నటుడిగా సినీరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గుర్తుపట్టారా ?..

పైన ఫోటో బ్యాడ్మింటన్ రన్నరప్ మెడల్ అందుకుంటున్న ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ హీరో. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న పాత్రలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ హీరోగానే కాదు.. అతడు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఈ విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు దగ్గరి బంధువు. త్వరలోనే ఈ స్టార్ హీరో తనయుడు కూడా నటుడిగా సినీరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గుర్తుపట్టారా ?.. అతను మరెవరో కాదండి.. దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. మహేష్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు. కానీ వీరిద్దరి స్టార్ డమ్ ఉపయోగించుకోకుండానే నటుడిగా అరంగేట్రం చేసి మెప్పించాడు. కృష్ణకు సుధీర్ బాబు అల్లుడు అవుతాడనే విషయం తెలిసింది. కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని భర్త.
2010లో ఏ మాయ చేసావే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. ఆ తర్వాత శివ మనసులో శృతి సినిమాలో కనిపించాడు. మోసగాళ్లకు మోసగాడు, నన్ను దోచుకుందవటే సినిమాల్లో కనిపించాడు. ఇటీవలే మామ మశ్చింద్ర సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తున్న సుధీర్ బాబు,… ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్. అతను ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. ఒకసారి డబుల్స్ భాగస్వామిగా పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆడాడు. అప్పట్లో బ్యాడ్మింటన్ రన్న రప్ మెడల్ అందుకుంటున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అలాగే క్రికెట్ లో మంచి ప్లేయర్. ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సుధీర్ బాబు.
ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు సుధీర్ బాబు. ఆ సమయంలో తన కొడుకు చరిత్ మానస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన కుమారుడు సినీరంగ ప్రవేశం చేయడానికి ఇంకా రెండుమూడేళ్ల సమయం ఉందని.. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని అన్నారు. చరిత్ మానస్ చూడటానికి అచ్చం మహేష్ బాబులాగే కనిపిస్తాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




