Punarnavi Bhupalam: అనారోగ్యానికి గురైన మరో నటి.. ఊపిరితిత్తుల సమస్యతో..
అప్పుడెప్పుడో రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన ఉయ్యాలైన జంపాలైన సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకుంది పునర్నవి.

పునర్నవి భూపాలం.. ఈ అమ్మడి పేరు చాలా మందికి తెలియక పోవచ్చు కానీ చూస్తే మాత్రం అరెరే ఈ బ్యూటీనా.. అని గుర్తుపట్టేస్తారు. అప్పుడెప్పుడో రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన ఉయ్యాలైన జంపాలైన సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకుంది పునర్నవి. ఆ తర్వాత ఈ భామ బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంది. బిగ్ బాస్ పుణ్యమా అని ఈ భామకు ఫుల్ క్రేజ్ వచ్చి పడింది. బిగ్ బాస్ హౌస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కు పునర్నవికి మధ్య సంథింగ్ సంథింగ్ అటు బాగా ప్రచారం జరిగింది. దాంతో ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది పునర్నవికి. అయితే ఈ భామ మాత్రం సినిమాల్లో మెరవలేదు. విదేశాల్లో చదువుకుంటూ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది పునర్నవి.
తాజాగా పునర్నవి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఆమె అభిమానులను షాక్ కు గురయ్యేలా చేస్తోంది. తనకు అనారోగ్యంగా ఉందని చాలా రోజులుగా ఈ అనారోగ్యంతో బాధపడుతున్న అని పోస్ట్ పెట్టింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నా అని తెల్పింది పునర్నవి.
పునర్నవి అనారోగ్యానికి గురైందని తెలిసి ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. పునర్నవి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.





Punarnavi Bhupalam