AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ సినిమాలో అల్లు అర్జున్ గారాలపట్టి.. అర్హ నటించే ఆ సినిమా ఏంటంటే

ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ ఇద్దరియూ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Mahesh Babu: మహేష్ సినిమాలో అల్లు అర్జున్ గారాలపట్టి.. అర్హ నటించే ఆ సినిమా ఏంటంటే
Mahesh Babu, Arha
Rajeev Rayala
|

Updated on: Jan 03, 2023 | 8:11 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ ఇద్దరియూ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ మహేష్ కుటుంబంలో విషాదం నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు త్రివిక్రమ్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అర్హ ఇప్పటికే సోషల్ మీడియా సూపర్ స్టార్. అర్హ కు సంబంధించిన అల్లరి పనులను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు . అలాగే ఇటీవల అర్హ శాకుంతలం సినిమాలో చిన్న పాత్రలో కూడా నటించింది.

ఈ క్రమంలోనే మహేష్ సినిమాలోనూ అర్హ నటిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు త్రివిక్రమ్, మహేష్ బన్నీని అడగ్గా ఆయన ఓకే చేశారుని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక మహేష్ రాజమౌళి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా