Uma Maheshwari: ఉమామహేశ్వరి ఆత్మహత్యకు ఆరోగ్య సమస్యలే కారణమా..?
ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగింది..నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి( Uma Maheshwari) సూసైడ్ చేసుకున్నారు.కొన్ని రోజులుగా ఆనారోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది..
ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగింది..నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి( Uma Maheshwari) సూసైడ్ చేసుకున్నారు.కొన్ని రోజులుగా ఆనారోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది..వాటి ఫలితంగానే ఇవాళ సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు కుటుంబీకులు.. సోమవారంఉదయం 10గంటల సమయంలో ఉమామహేశ్వరి ఇంటికి వచ్చారు చిన్నకూతురు దీక్షిత, ఆమె భర్త..వాళ్లతో మాట్లాడి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన ఉమామహేశ్వరి మధ్యాహాన్నం 2గంటలైనా బయటకు రాకపోవడంతో తలుపుతట్టి లేపే ప్రయత్నం చేశారు ఫ్యామిలీ మెంబర్స్..ఎంతకీ తీయకపోవడంతో బలవంతంగా తెరిచిన కుటుంబీకులకు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు ఉమామహేశ్వరి
అయితే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కూతురు దీక్షితానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు..2.45 సమయంలో పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు..ఉస్మానియాలో పోస్టుమార్టం జరిగింది.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఉమామహేశ్వరి ఇంటికి తరలివచ్చారు. బాలకృష్ణ, కల్యాణ్ రామ్, చంద్రబాబు, నారా లోకేష్ సహా పలువురు ఎన్టీఆర్ కుటుంబీకులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కి సమాచారం అందించారు. పలువురు ఉమామహేశ్వరి మృతిపై సంతాపం తెలుపుతున్నారు.