Vijay Deverakonda: లైగర్ క్రేజ్ చూసి పిచ్చేక్కిపోయిన యాంకర్.. విజయ్ ఫాలోయింగ్ చూసి మైండ్ బ్లోయింగ్..

అతడిని చూసేందుకు పోటా పోటీగా వేదిక వద్దకు దూసుకురావడంతో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. దీంతో విజయ్, అనన్య ఈవెంట్ మధ్య నుంచి వెళ్లిపోయారు.

Vijay Deverakonda: లైగర్ క్రేజ్ చూసి పిచ్చేక్కిపోయిన యాంకర్.. విజయ్ ఫాలోయింగ్ చూసి మైండ్ బ్లోయింగ్..
Liger
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 01, 2022 | 1:33 PM

Liger Movie: పాన్ ఇండియా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ లైగర్ (Liger). మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండే జంటగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే లైగర్ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. గత కొద్ది రోజులుగా లైగర్ టీం ముంబై వీధులలో సందడి చేస్తుంది. ప్రజలను నేరుగా కలుస్తూ అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు విజయ్, అనన్య. ఇక ఆదివారం ముంబైలోని ఓ మాల్‏లో నిర్వహించిన లైగర్ ప్రమోషన్స్ గురించి చెప్పక్కర్లేదు. విజయ్ ఎంట్రీ చూసి నోరెళ్లపెట్టారు ఫ్యాన్స్. రౌడీ హీరో పోస్టర్స్, స్కెచ్ ఆర్ట్స్ చేత పట్టుకుని వి లవ్ యూ విజయ్ అంటూ అరుపులతో హోరెత్తించారు. ఇక ఏకంగా అమ్మాయిలు విజయ్ ను నేరుగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడిని చూసేందుకు పోటా పోటీగా వేదిక వద్దకు దూసుకురావడంతో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. దీంతో విజయ్, అనన్య ఈవెంట్ మధ్య నుంచి వెళ్లిపోయారు.

ఇదంతా పక్కన పెడితే ముంబైలో లైగర్ క్రేజ్ చూసి ఈవెంట్ హోస్ట్ చేస్తున్న యాంకర్ నితిన్ జక్కర్‏కు పిచ్చేక్కిపోయింది. నార్త్‏లో తెలుగు హీరో పవర్ చూసి నోరెళ్లబెట్టారు. లైగర్ క్రేజ్ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు నితిన్ జక్కర్. ముంబైలో ఇంతకంటే పెద్ద క్రేజ్ మరొకటి లేదు. ఇంతపెద్ద ఈవెంట్‏కు హోస్ట్ చేయడానికి వచ్చాను. హిందీలో విజయ్ భాయ్ క్రేజ్ మైండ్ బ్లోయింగ్. నేను ఎన్నో సినిమాల ఈవెంట్స్ కు హోస్ట్ గా వ్యవహరించాను. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ చిత్రాల ప్రమోషన్లకు యాంకరింగ్ చేశాను. కానీ విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. నేనేం చెప్పాలి భారీగా తరలివచ్చారు ఫ్యాన్స్. పరిస్థితి చేయి దాటడంతో ఈవెంట్ మధ్యలోనే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే విజయ్ సర్‏ను చూసేందుకు వేదికవైపుకు ఎక్కువగా ఫ్యాన్స్ వచ్చారు. నవి ముంబైలో నిర్వహించి ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అలాగే లైగర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ తన ఎక్సైట్‏మెంట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అతని తల్లి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ చిత్రంపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో ఆగస్ట్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.