Ravi Teja’s Khiladi: డింపుల్ హయతి అందాలకు మైమరచిపోయిన మాస్ రాజా.. ఆకట్టుకుంటున్న వీడియో..

మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. మొన్నటి వరకు సరైన హిట్ లేక సతమతం అయిన మాస్ రాజా

Ravi Teja's Khiladi: డింపుల్ హయతి అందాలకు మైమరచిపోయిన మాస్ రాజా.. ఆకట్టుకుంటున్న వీడియో..
Khiladi
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Aug 23, 2021 | 8:04 AM

Ravi Teja’s Khiladi: మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. మొన్నటి వరకు సరైన హిట్ లేక సతమతం అయిన మాస్ రాజా.. క్రాక్ సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు రవితేజ. శృతి హాసన్ మరోసారి రవితేజకు జోడీగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫుల్ జోష్‌లో ఉన్న రవితేజ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌‌‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ఆగస్టు 22న దర్శకుడు రమేష్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాట ప్రోమోను విడుదుల చేశారు. ఫుల్ సాంగ్‌ను సెప్టెంబర్ 10న విడుదుల చేయనున్నారు.

ఈ వీడియోలో రవితేజ హీరోయిన్ అందాన్ని చూసి మైమరచి పోయినట్టు చూపించారు. హీరోయిన్ డింపుల్ హయతి అప్పుడే స్నానం చేసి ఆరుబయట కురులు ఆరబోసుకుంటుండగా ఆ అందమైన కురుల నుంచి జారిపడిన నీటి బిందువు నేరుగా రవితేజ బుగ్గనే తాకింది. ఆ తర్వాత హీరోయిన్ వంటి పై నుంచి మరో నీటి బిందువు జారుతూ కనిపిస్తుంది. ఆ అందానికి రవితేజ ఫిదా అయిపోయారు. ఈ వీడియో ఇప్పడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాత శరత్ మండవతో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాకు ‘ రామారావు ఆన్ డ్యూటీ` అనే టైటిల్ ని ప్రకటించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్.. బర్త్ డే వేళ 24 విభాగాల్లోని సినీ కార్మికులకు స్వీట్ న్యూస్

లడఖ్‌లో మొట్టమొదటి ‘రోవింగ్’ థియేటర్‌ ఏర్పాటు.. ఇందులో ఓ జాతి చరిత్రను తొలిసారి ప్రదర్శించారు..

MLA Roja: మహాబలిపురం రిసార్ట్‌లో రాఖీ వేడుకలు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. చిత్రాలు