AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న పొడుగుకాళ్ల సుందరి.. క్రిటిక్స్‌కు షాకిస్తున్న హీరోయిన్

ఆమె తెరపై కనిపిస్తే ఒక తెలియని ఉత్సాహం.. ఐదు అడుగుల పది అంగుళాల పొడవుతో గ్లామర్ కు కొత్త అర్థం చెప్పిన ఈ సుందరాంగి, మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘చిట్టి’గా పాగా వేసింది. కేవలం నటన మాత్రమే కాదు, డాన్స్, మ్యూజిక్, ర్యాప్ ఇలా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేస్తోంది.

కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న పొడుగుకాళ్ల  సుందరి.. క్రిటిక్స్‌కు షాకిస్తున్న హీరోయిన్
Tollywood Young Heroine..
Nikhil
|

Updated on: Feb 09, 2026 | 7:10 PM

Share

ఆమె కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న విమర్శలు, ఆమె ఎత్తు గురించి వచ్చిన కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. కానీ అవన్నీ దాటుకుని ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది.నటనలోకి రాకముందు ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ లో ఆరు సంవత్సరాల పాటు థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. అక్కడే నటిగా తన పునాది పడింది. కేవలం నటనకే పరిమితం కాకుండా డాన్సర్ గా, మ్యూజీషియన్ గా, క్రియేటివ్ ఆర్టిస్ట్ గా తనను తాను మలుచుకుంది. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఈమె జీవితం పూర్తిగా మారిపోయింది. ‘ఎవరు ఈ అమ్మాయి?’ అని అనుకునే స్థాయి నుంచి, ప్రతి ఇల్లు ‘మన చిట్టి’ అని పిలుచుకునేలా అభిమానం సంపాదించుకుంది.

వెక్కిరించిన వారికి సమాధానం..

ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు ఉండటం ఒకప్పుడు తనకు మైనస్ అని చాలామంది అనేవారట. కేవలం గెస్ట్ రోల్స్ కు మాత్రమే సెట్ అవుతావు అని ముఖం మీదే కామెంట్స్ చేసేవారని ఫరియా గుర్తు చేసుకుంది. కానీ తనేంటో తన సినిమాలతోనే నిరూపించుకోవాలని నిర్ణయించుకుని ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం తమిళంలో ‘వల్లి మయిల్’ అనే సినిమా కోసం స్టంట్స్ కూడా చేస్తూ కొత్త ఫారియాను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.

నటనతో పాటు సంగీతం అంటే ఫరియాకు ప్రాణం. స్వయంగా పాటలు రాయడం, కంపోజ్ చేయడం ఈమెకు ఇష్టం. ‘డ్రామా నక్కో మామ’ అనే పాట ఈమె చేసిన ఒక మ్యూజికల్ ఎక్స్‌పెరిమెంట్. అలాగే తనను తాను ఒక ‘మూవ్‌మెంట్ ప్రాక్టీషనర్’గా పిలుచుకుంటుంది. హిప్‌హాప్, కథక్, బెల్లీ డాన్స్, బీ-బాయింగ్ ఇలా అన్ని రకాల డాన్స్ ఫార్మ్స్ లో ఈమె ఆరితేరింది. తన శరీరాన్నే ఒక భాషగా మలుచుకుని ప్రదర్శనలు ఇస్తుంటుంది.

Faria Abdullaahh

Faria Abdullaahh

సింపుల్ లైఫ్..

ఫరియా బ్యూటీ సీక్రెట్ చాలా సింపుల్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, కాన్షస్ ఈటింగ్ ద్వారా తన గ్లో ని కాపాడుకుంటోంది. మేకప్ తీసేయడానికి కేవలం బేబీ ఆయిల్ మాత్రమే వాడుతుందట. హెయిర్ కేర్ కోసం వారానికి రెండు మూడు సార్లు ఆయిల్ మసాజ్ తప్పనిసరి అని చెబుతోంది. ఇక తినే విషయంలో హైదరాబాదీ బిర్యానీ అంటే ఫరియాకు వీక్ నెస్. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు రకరకాల దేశీ, విదేశీ రుచులను ఆస్వాదించడం ఫరియాకు ఇష్టమట.

ఇక, సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే మరో స్టార్ ఫరియా పెంపుడు పిల్లి ‘సెబాస్టియన్’. అది లేకపోతే తన రోజు పూర్తి కాదని ఫరియా చెబుతోంది. సమాజం ఇచ్చే స్టేట్‌మెంట్స్ ని పక్కన పెట్టి, తన కలల దారిలో దూసుకుపోతున్న ఫరియా అబ్దుల్లా నిజంగా ఎంతోమంది యువతులకు స్ఫూర్తి. మరి ఫరియా తమిళ ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Follow Us