శింబు-త్రిష పెళ్లి, తమిళనాట వార్తలు చక్కర్లు !
తమిళనాట శింబు, త్రిషల పెళ్లి హడావిడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'విన్నైతండి వరువాయ' (తెలుగులో 'ఏమాయ చేశావే') సినిమాలో కలిసి నటించి ప్రేక్షకుల అలరించారు హీరోహీరోయిన్లు శింబు, త్రిష.
తమిళనాట శింబు, త్రిషల పెళ్లి హడావిడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘విన్నైతండి వరువాయ’ (తెలుగులో ‘ఏమాయ చేశావే’) సినిమాలో కలిసి నటించి ప్రేక్షకుల అలరించారు హీరోహీరోయిన్లు శింబు, త్రిష. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అసలు వీరిద్దరూ నిజమైన ప్రేమికులా అన్నంతగా ఆ పాత్రల్లో నటించారు. వీరు దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నారంటూ గతంలో చాలాసార్లు వార్తలు సర్కులేట్ అయ్యాయి. తాము మంచి స్నేహితులమే అని ఈ జంట ఆ వార్తలను తోసిపుచ్చింది. కాగా, లాక్‌డౌన్ సమయంలో త్రిష-శింబు కలిసి ‘కార్తీక్ డయల్ సేతా యెన్’ అనే షార్ట్ ఫిల్మ్ కోసం పనిచేశారు. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల అనౌన్స్ చేశారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా అయితే ఇలాంటి వదంతులు వచ్చినప్పుడు అవి ఫేక్ అయితే హీరో లేదా హీరోయిన్ ఎవరో ఒకరు వాటిని ఖండిస్తారు. కానీ ఇప్పటివరకు శింబు, త్రిషల విషయంలో అది జరగలేదు. దీంతో జనాల్లో అనుమానాలు బలపడ్డాయి. ( చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..! )
ఇక తాజాగా శింబు తండ్రి టి.రాజేందర్ సైతం ఈ ప్రచారం మీద స్పందించడానికి ఇష్టపడలేదు. తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఈ ఏడాది శింబు తండ్రి రాజేందర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించడానికి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ విలేకరి.. శింబు-త్రిష పెళ్లి గురించి స్పందించమని కోరగా.. ఆయన మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేశారు. దీంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది.
( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )
( ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు ! )