అగ్నిప్రమాదంపై స్పందించిన నాగార్జున
అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు ఈ ఉదయం తెలిసింది. ఓ సినిమా కోసం వేసిన
Annapurna studios fire accident: అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు ఈ ఉదయం తెలిసింది. ఓ సినిమా కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం సంభవించిందని, అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం వచ్చింది. అయితే ఈ ప్రమాదాన్ని నాగార్జున కొట్టిపారేశారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన నాగార్జున.. ”అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంతా బావుంది” అని కామెంట్ పెట్టారు.
Read More:
విష్ణు, కాజల్‌ల ‘మోసగాళ్లు’.. భాగం అవుతోన్న వెంకటేష్
5 సంవత్సరాల తర్వాత.. క్రేజీ కాంబో ఈజ్ బ్యాక్
There are some articles in the media that there has been a major fire At Annapurna Studios this morning… Not to worry this is WRONG NEWS and everything is absolutely fine??
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 16, 2020