ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు !

డిగ్రీ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఆన్‌లైన్‌ అడ్మిషన్స్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు బీఎస్సీ చదవాలంటే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు !
Follow us

|

Updated on: Oct 16, 2020 | 3:15 PM

డిగ్రీ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఆన్‌లైన్‌ అడ్మిషన్స్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు బీఎస్సీ చదవాలంటే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే ఇంటర్‌ పాసయితే చాలు.  ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, అటానమస్‌ డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్స్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీలో 85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు కేటాయించనున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు కూడా రిజర్వేషన్‌ విధానం అమలు కానుంది. ( చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..! )

చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారిని.. శ్రీ వెంకటేశ్వర, యోగి వేమన, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాల పరిధిలో అడ్మిషన్స్‌కు స్థానికులుగా పరిగణిస్తారు. కృష్ణా,  గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారిని ఆంధ్రా, కృష్ణా, ఆచార్య నాగార్జున, ఆదికవి నన్నయ, డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల పరిధిలో అడ్మిషన్స్‌కు స్థానికులుగా పరిగణిస్తారు. మొత్తం సీట్లలో సూపర్‌ న్యూమరీగా 10% సీట్లను ఆర్థికంగా వెనకబడిన బలహీనవర్గాల కోటాగా కేటాయిస్తారు. ప్రతి కోర్సులోనూ మహిళల కోటా కింద 33.33% వర్తింపజేస్తారు. ఎన్‌సీసీ కోటాలో 1% సీట్లు కేటాయిస్తారు. ఇంటర్‌లో కామర్సు ఒక సబ్జెక్టుగా చదివిన వారికి రాష్ట్రస్థాయిలో బీకామ్‌లో 60% సీట్లు కేటాయిస్తారు. సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌ చదివిన వారికి.. బీఏ కోర్సుల్లో 50% సీట్లు కేటాయిస్తారు. ( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..