విష్ణు, కాజల్‌ల ‘మోసగాళ్లు’.. భాగం అవుతోన్న వెంకటేష్

మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది

విష్ణు, కాజల్‌ల 'మోసగాళ్లు'.. భాగం అవుతోన్న వెంకటేష్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 16, 2020 | 3:15 PM

Venkatesh Mosagallu Narattor: మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. జెఫ్రీ ఘీ చిన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే టీజర్‌, ఫస్ట్‌లుక్‌లతో ఈ మూవీ ఆకట్టుకోగా.. మోసగాళ్లుపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఆ అంచనాలను మరింత పెంచేందుకు మూవీ యూనిట్‌ మరో ప్లాన్ చేసింది. ఇందులో విక్టరీ వెంకటేష్ భాగం కాబోతున్నారు. మోసగాళ్లకు వెంకటేష్ తన వాయిస్‌ని ఇస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రధాన పాత్రాధారులను పరిచయం చేయడంతో పాటు.. సినిమాలో కీలక సన్నివేశాల సమయంలోనూ వెంకటేష్‌ గొంతు వినిపించనుందట. ఆయన నెరేషన్‌తో తెరపై వెంకీ ఉన్నట్లుగా ప్రేక్షకులు ఫీల్ అవుతారని మూవీ యూనిట్ భావిస్తోంది. కాగా ఈ మూవీలో విష్ణు, కాజల్‌ కవలలుగా కనిపించనుండగా.. త్వరలోనే వేటగాళ్లు షూటింగ్‌ పూర్తి కానున్నట్లు సమాచారం.

Read More:

5 సంవత్సరాల తర్వాత.. క్రేజీ కాంబో ఈజ్‌ బ్యాక్‌

బీజేపీ క్యాంపైన్‌ పాటను నా సాంగ్‌ నుంచి కాపీ కొట్టారు: బాలీవుడ్ స్టార్ దర్శకుడు