Diwali Entertainment : బుల్లితెరపై దీపావళి సందడి.. జీ తెలుగులో కుటుంబం అవార్డ్స్ .. జయమ్ము నిశ్చయమ్మురా 2లో మంత్రి నారా లోకేశ్..
దీపావళి పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రేక్షకులకు మరింత వినోదాల విందు అందించేందుకు రెడీ అయ్యింది జీ తెలుగు. నవంబర్ 7న శనివారం సాయంత్రం 5 గంటలకు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్ 2 స్ట్రీమింగ్ చేయనుంది. అలాగే దీపావళి పండగ రోజున అంటే ఆదివారం రాత్రి 7.30 గంటలకు జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2లో మంత్రి నారా లోకేశ్ కు సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ ప్రసారం చేయనున్నారు. మరిన్ని వివరాలు ఏంటో తెలుసుకుందాం.

దీపావళి పండుగ వేళ బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు జీ తెలుగు ఛానల్ ఘనంగా సిద్ధమైంది. అట్టహాసంగా సాగే ప్రత్యేక కార్యక్రమాలు, అవార్డుల వేడుకలు, స్టార్ల ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు డబుల్ ధమాకా ప్లాన్ చేసింది. ఈ వారాంతంలో ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’ , ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ ప్రత్యేక ఎపిసోడ్‌లను ప్రసారం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. మొదటగా నవంబర్ 7, శనివారం సాయంత్రం 5 గంటలకు ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’ ప్రసారం కానుంది. ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల టెలివిజన్ రంగంలో 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పరిచయంతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకలో బుల్లితెర నటీనటులకు మహానాయకుడు, ఐకానిక్ కపుల్, లవర్ బాయ్ ఆఫ్ జీ తెలుగు, సూపర్ క్వీన్, పాపులర్ ఫేస్ ఆఫ్ ప్రైమ్ టైమ్ ఫిమేల్, ఉత్తమ కథానాయకుడు, నవనాయకి, ఉత్తమ కోడలు, తెలుగు అమ్మాయి వంటి పలు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేయనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ఈ అవార్డుల పండుగలో టాలీవుడ్ ప్రముఖులు బాబు మోహన్, లయ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, మధుమిత, బ్రహ్మాజీ, నివేదా పేతురాజ్, బాబా భాస్కర్, గెహనా సిప్పీ, మానస వారణాసి తదితరులు హాజరై సందడి చేయనున్నారు. అద్భుతమైన డాన్స్ పర్‌ఫార్మెన్స్‌లు, ఫన్నీ సంభాషణలు, అభిమానుల సర్‌ప్రైజ్‌లతో ఈ ఈవెంట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఇక దీపావళి వినోదంలో రెండో భాగంలో భాగంగా నవంబర్ 8, ఆదివారం రాత్రి 7:30 గంటలకు ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ ప్రత్యేక ఎపిసోడ్ ప్రసారం కానుంది. సీనియర్ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పాల్గొనడం విశేషం. జగపతిబాబుతో సాగిన ఈ ప్రత్యేక సంభాషణలో నారా లోకేశ్ తన రాజకీయ ప్రయాణం, వ్యక్తిగత విషయాలు, అలాగే పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఒకవైపు సినీ, బుల్లితెర తారలతో నిండిన కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2 వేడుక, మరోవైపు మంత్రి నారా లోకేశ్‌తో జగపతిబాబు ఇంటర్వ్యూ.. ఈ రెండింటి కలయికతో జీ తెలుగు ఈ దీపావళికి పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌ను అందిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
