AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భరించలేని తామర, గజ్జి పోవాలంటే ఇది రుద్దితే.. దురద, మంటలు తగ్గుతాయ్

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, అందమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ అనేక కారణాల వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో దురద, మంట, పాత మచ్చలు, తామర , గజ్జి వంటివి చాలా సాధారణం. ఈ సమస్యలన్నింటికీ మందుల షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

Prasanna Yadla
|

Updated on: Nov 05, 2026 | 12:36 PM

Share
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, అందమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ అనేక కారణాల వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో దురద, మంట, పాత మచ్చలు, తామర , గజ్జి వంటివి చాలా సాధారణం. ముఖ్యంగా కాళ్ళ మధ్య, చంకలలో చెమట వాసన, విపరీతమైన దురద వంటివి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ సమస్యలన్నింటికీ మందుల షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి సమయం కేటాయిస్తే మీ  ఇంట్లోనే సహజసిద్ధమైన ఔషధాన్ని తయారుచేసుకోవచ్చు.

1 / 5
చర్మంపై ఎర్రటి రంగులో గుండ్రంగా వచ్చి, విపరీతమైన దురదను కలిగిస్తే అది రింగ్‌వార్మ్ లేదా తామరగా గుర్తించాలి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ శరీరంపై ఎక్కడైనా రావచ్చు, అయితే ఎక్కువగా గజ్జలు, చంకలు, నడుము చుట్టూ వస్తుంది. గాయాలు లేదా చర్మం దెబ్బతిన్న చోట ఈ ఫంగస్ సులభంగా వ్యాపిస్తుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు, లేదా వదులుగా లేని బట్టలు ధరించేవారిలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. అయితే, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండే వారికి తామర దూరంగా ఉంటుంది.

2 / 5
ఈ ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసుకోవడానికి అవసరమైన పదార్థాలు సులభంగా దొరుకుతాయి. మొదటగా, కర్పూరాన్ని తీసుకోవాలి. నాలుగు కర్పూరం బిళ్ళలను మెత్తని పొడిలా దంచుకోవాలి. కర్పూరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, మొటిమలు, పగుళ్లకు కూడా కర్పూరం మంచి ఔషధం. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుంటే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.

3 / 5
ఆ తరువాత, 10 నుండి 12 తులసి ఆకులను శుభ్రంగా కడిగి, పేస్ట్‌లా నూరుకోవాలి. తులసి ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా చెబుతున్నారు. జలుబు, తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు, వాపులు, గుండె జబ్బులు, మలేరియా వంటి అనేక సమస్యలను తులసి నయం చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు, మనం ముందుగా దంచి పెట్టుకున్న కర్పూరం పొడిలో తులసి పేస్ట్‌ను కలిపి బాగా మిక్స్ చేయాలి. దీనికి చివరగా కలబంద గుజ్జును కలుపుకోవాలి.

4 / 5
కలబందలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గ్లిసరిన్, సోడియం కార్బోనేట్ వంటి పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. ఒక కలబంద ఆకును తీసుకొని, అంచులను తొలగించి, గుజ్జును సేకరించాలి. ఈ గుజ్జును కర్పూరం-తులసి మిశ్రమంలో కలిపి బాగా కలపాలి. చివరగా, ఈ మిశ్రమంలో నాలుగు లేదా ఐదు చుక్కల నిమ్మరసాన్ని పిండాలి. నిమ్మకాయ విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసం గజ్జి, తామర, చుండ్రు, మొటిమల వంటి చర్మ వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. నిమ్మరసాన్ని కలిపిన తర్వాత, మిశ్రమాన్ని అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్ని పదార్థాలు వాటి ప్రభావాన్ని చూపుతాయి.

5 / 5
Follow Us