బీజేపీ క్యాంపైన్ పాటను నా సాంగ్ నుంచి కాపీ కొట్టారు: బాలీవుడ్ స్టార్ దర్శకుడు
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం అయ్యింది. ఒకరికొకరు పోటీగా క్యాంపైన్‌ని స్టార్ట్ చేశాయి పార్టీలు.

Anubhav Sinha BJP: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం అయ్యింది. ఒకరికొకరు పోటీగా క్యాంపైన్‌ని స్టార్ట్ చేశాయి పార్టీలు. మరో రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం నిమిత్తం బీజేపీ ఓ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. బీహార్ మే కా బా అంటూ సాగే ఈ ర్యాప్ పాట అక్కడి వారిని బాగానే ఆకట్టుకుంటుంది.
అయితే దీనిపై బాలీవుడ్ స్టార్ డెరెక్టర్ అనుభవ్ సిన్హా మండిపడ్డారు. ఈ ర్యాప్‌ని తన పాటను కాపీ కొట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టారు. ”నేను ఇది చెప్పకూడదు. కానీ చెప్పకపోతే నాతో నాకు ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో నా స్నేహితులు నన్ను హెచ్చరించారు. కానీ వారిని కూడా నేను ఇష్టపడుతున్నా. బీహార్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఓ క్యాంపైన్ పాటను విడుదల చేసింది. ఈ పాట ఆరు వారాల క్రితం నేను విడుదల చేసిన బాంబే మే కా బా అనే ర్యాపో నుంచి కాపీ కొట్టారు. ఆ పాట మీద నాకు వందశాతం కాపీ హక్కులు ఉన్నాయి. బీజేపీ ఈ దేశాన్ని పరిపాలిస్తోంది. ఈ దేశంలో ఆ పార్టీ వేరొకరి హక్కులను ఎలా హరిస్తుంది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ విషయంలో నా అనుమతి కోసం ఎవరూ నన్ను కలవలేదు. వారు నన్ను కలవకపోవడం వెనుక ఏదైనా కారణం ఉండొచ్చు. కానీ ఇందులో నాకు క్రెడిట్ ఇవ్వాలి. అలాగే వారి మద్దతుదారులు నన్ను ట్రోల్ చేయకుండా ఉండాలి. థ్యాంక్యు” అని కామెంట్ పెట్టారు. కాగా వలస కార్మికుల కష్టాలను తెలియజేస్తూ అనుభవ్ సిన్హా బాంబే మే కా బా అనే ర్యాప్ పాటను గత నెల విడుదల చేశారు. అందులో మనోజ్ బాజ్‌పేయి నటించారు.
Read More:
కోహ్లీ డ్యాన్స్ వీడియోపై ఆర్చర్ ఫన్నీ కామెంట్
జైల్లో హీరో నితిన్.. అసలు ఏమైంది..!
Please listen to this song. This doesn't even use the word Bihar once. @BJP4India #bambaimeinkaba https://t.co/4nwDct8zUg pic.twitter.com/vJLkF13FWQ
— Anubhav Sinha (@anubhavsinha) October 14, 2020