AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivation: ఓటమి మాత్రమే నేర్పగలిగే 8 సూత్రాలు.. ఇవి తెలిస్తే ఎదురుదెబ్బలు మిమ్మల్నేం చేయలేవు..

జీవితంలో ఓటములు, ఎదురుదెబ్బలు సర్వసాధారణం . ఒక వ్యాపారం కొన్నిసార్లు అకస్మాత్తుగా కోట్ల నష్టం చవిచూడాల్సి వస్తుంది. లేదా ఉన్నదంగా కోల్పోవలసి వస్తుంది. దానర్థం అతడిక వ్యాపారమే చేయడని కాదు. జీవితం విసిరిన సవాళ్లను సైతం దాటుకుంటూ ముందుకు వెళ్తేనే అందులో ఉన్న కిక్కేంటో తెలుస్తుంది. మీరు మీకు ఎదురైన ఎదురుదెబ్బలు, ఓటముల నుంచి ఏం నేర్చుకున్నారు. వాటి నుంచి వేగంగా కోలుకోవడానికి అవసరమైన ఎనిమిది ముఖ్యమైన విషయాలివి.

Motivation: ఓటమి మాత్రమే నేర్పగలిగే 8 సూత్రాలు.. ఇవి తెలిస్తే ఎదురుదెబ్బలు మిమ్మల్నేం చేయలేవు..
Failure To Success Life Lessons
Bhavani
|

Updated on: Mar 16, 2025 | 2:41 PM

Share

పడిపోవడం అంటే ఓటమి కాదు.. అందులో నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన ఓటమి. మీకు ఎదురైంది ఎలాంటి కష్టమైనా అవ్వనీయండి. అది మిమ్మల్ని జీవితంలో ఎంత కిందకైనా లాగనివ్వండి. తిరిగి నిలదొక్కుకోవడం తెలిసినోడే జీవితాన్ని గెలుస్తాడు. మరి వైఫల్యాల నుంచి ఎలా కోలుకుని తిరిగి సాధారణ స్థితికి రావాలి? సాధారణ మనుషులకు గెలుపును ముద్దాడిని వారికి ఉన్న ఒకే ఒక్క తేడా ఇది. దీన్ని మీరు కూడా మీ లైఫ్ లో అప్లై చేసి చూడండి. జీవితం విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉండాలంటే ముందు మీకు ఈ 8 విషయాలు తెలిసుండాలి.

1. ఓటమిని అంగీకరించడం

ఓటమిని అంగీకరించడం నేర్చుకుంటే జీవితం చాలా సులువవుతుంది. ఇలాంటి పరిస్థితి కలిగినప్పుడు వీటిని జీవితంలో ఒక అంతర్భాగమని గుర్తించాలి. వీటిని విజయానికి మెట్లుగా స్వీకరించగలిగినప్పుడే మరింత దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారు.

2. తప్పులకు బాధ్యత వహించడం

మన జీవితంలో జరిగే తప్పులన్నింటికీ బాధ్యత మనదేనని గుర్తించాలి. అప్పుడే మీలో పరిణితి వస్తుంది. వీటినే భవిష్యత్తు పురోగతికి పాఠాలుగా మలుచుకోగలగాలి.

3. సెల్ఫ్ పిటీ అవసరమే..

మీ జీవింతంలో చవిచూసిన ఓటములను తప్పిదాలుగా భావించాలి. అంతేకానీ వాటి కారణంగా మీకు మీరు శిక్ష వేసుకోరాదు. అందరూ తప్పులు చేస్తారు. వైఫల్యం ఒక విలువైన పాఠం అని మనం అర్థం మచేసుకోవాలి.

4. భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టండి

గత వైఫల్యాలు ఎదురుదెబ్బలపై దృష్టి పెట్టడం కంటే భవిష్యత్తు లక్ష్యాలు అవకాశాలపై దృష్టి సారించడం వలన ఇది ప్రేరణ ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇది నిరాశ నుండి కోలుకోవడానికి సహాయపడే ఉత్సాహాన్ని తెస్తుంది.

5. శారీరక మానసిక ఆరోగ్యం

క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి ధ్యానం వంటి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా దినచర్యను ప్లాన్ చేసుకోవాలి.

6. సానుకూల ఆలోచనలు

ఒకరోజులో మనసు లెక్కలేనన్ని ఆలోచనల్ని చేస్తుంది. మీరు నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే అవి మిమ్మల్ని వాటి స్వంత మార్గంలోకి తీసుకెళ్తాయి. అందుకే మనసును అదుపులో ఉంచుకోవాలి. దాని నుంచి మన ఆనందాన్ని రాబట్టుకోవాలి. అంతేగానీ మనసు చెప్పినట్టుగా సాగితే అది మనల్ని ఇరకాటంలో పడేసి దారి తోచకుండా చేయగలదు.

7. రిస్క్ తీసుకుంటున్నారా..

కొత్త అవకాశాలు, అభివృద్ధి పురోగతిని పెంచుకోవడానికి, ఒకరు ఎల్లప్పుడూ మార్పుకు సిద్ధంగా ఉండాలి. అందులో ఉన్న నష్టాలకు భయపడకుండా రిస్క్ తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.

8. నిరంతర శ్రమ..

చాలా మంది విజయానికి చాలా దగ్గరగా వచ్చి దాన్ని అందుకోకుండానే డీలా పడిపోతుంటారు. అందుకే వారి జీవితాల్లో ఓటమి ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా మీ పనిని మీరు చేస్తూనే ఉండాలి. తెలివైన వ్యక్తులు మాత్రమే అడ్డంకులను దాటుకుని ముందుకు సాగే మార్గాలను కనుగొంటారు. కొత్త దారులను అన్వేషిస్తారు.