Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతీనెల రూ.87 వేలు.. కేవలం ఒక్కసారి పెట్టుబడితో 30 ఏళ్లు కూర్చోని తినొచ్చు!

రూ.5,00,000ల పెట్టుబడితో 12 శాతం వార్షిక రాబడితో 30 ఏళ్లలో రూ.1,49,79,961 సంపాదించవచ్చు. పన్ను తర్వాత కూడా ఈ మొత్తంతో SWP ద్వారా నెలకు రూ.87,000 పొందవచ్చు. 7% రాబడితో కూడా నెలకు రూ.87,000 లభిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వానికి ఇది ఒక సురక్షితమైన మార్గం.

ప్రతీనెల రూ.87 వేలు.. కేవలం ఒక్కసారి పెట్టుబడితో 30 ఏళ్లు కూర్చోని తినొచ్చు!
Indian Currency
Follow us
SN Pasha

| Edited By: Ravi Kiran

Updated on: Mar 16, 2025 | 2:56 PM

జీవితాంతం కష్టపడి, రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే చాలా కష్టంగా ఉంటుంది. రోజూవారి అవసరాలకు, చిన్న చిన్న ఖర్చులకు కూడా పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆర్థికంగా మెరుగ్గా ఉండాలంటే జాబ్‌ చేస్తున్న సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి ఓ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే.. రిటైర్మెంట్‌ తర్వాత నెలకు 87 వేలను 30 ఏళ్లపాటు పొందే అవకాశం ఉంటుంది. దీని కోసం మీరు ఒకేసారి రూ.5,00,000 SWP (Systematic Withdrawal Plan)లో పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు మీ 25 ఏళ్ల వయస్సులో ఒకేసారి దీనిలో రూ.5,00,000 పెట్టుబడి పెడితే, మీరు ఈ పెట్టుబడిపై వార్షిక రాబడి సగటున 12 శాతం పొందే అవకాశం ఉంటుంది.

ఆ క్రమంలో 30 ఏళ్లపాటు అది క్రమంగా వృద్ధి చెందుతుంది. దీంతో 30 సంవత్సరాలలో అంచనా వేసిన మూలధన లాభం రూ.1,44,79,961కు చేరగా, పదవీ విరమణ తర్వాత మొత్తం రూ.1,49,79,961 చేరుకుంటుంది. అంటే మీరు 55 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు ఈ మొత్తం వస్తుందని చెప్పవచ్చు. ఇక పదవీ విరమణ మొత్తంపై ఆదాయపు పన్ను: ప్రస్తుతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను రేటు 12.5 శాతం అనుకుంటే, రూ.1,49,79,961 పై అంచనా వేసిన పన్ను రూ.17,94,370.125 (రూ.1,25,000 LTCG మినహాయింపుతో) అవుతుంది. పన్ను చెల్లించిన తరువాత, మిగిలిన పదవీ విరమణ నిధి రూ. 1,31,85,590.875 ఉంటుంది. ఇది SWP పెట్టుబడికి అంచనా వేసిన కార్పస్ అవుతుంది.

SWP (Systematic Withdrawal Plan)లో వచ్చిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌ లేదా FDలో పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా మీరు కావాల్సిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ వార్షిక వృద్ధి రేటు 7 శాతం వచ్చినా కూడా రూ.1,31,85,590.875 మొత్తంపై 30 సంవత్సరాలపాటు నెలకు రూ. 87,000 పొందవచ్చు. అలా మీకు 85 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ. 87 వేలు చేతికి వస్తాయి. 30 ఏళ్లలో ఉపసంహరించుకున్న మొత్తం రూ. 3,13,20,000 కాగా, మిగిలిన మొత్తం రూ. 2,64,203గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. రిటైర్మెంట్‌ తర్వాత కూడా హ్యాపీగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ ఎస్‌డబ్ల్యూపీలో పెట్టుబడి పెట్టండి.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.