Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ పెట్టుబడితో.. రూ.15 లక్షల ఆదాయం! అస్సలు రిస్క్‌ అనేదే ఉండదు!

పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ద్వారా తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడిని పొందవచ్చు. 7.5 శాతం వడ్డీతో, 5 లక్షల రూపాయలు 15 ఏళ్ళలో 15 లక్షల రూపాయలు అవుతాయి. పథకం పొడిగింపు నిబంధనలను అర్థం చేసుకోవడం ముఖ్యం. బ్యాంకులతో పోలిస్తే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలు సురక్షితమైనవి, వివిధ వ్యవధికి అందుబాటులో ఉన్నాయి.

తక్కువ పెట్టుబడితో.. రూ.15 లక్షల ఆదాయం! అస్సలు రిస్క్‌ అనేదే ఉండదు!
Money
Follow us
SN Pasha

|

Updated on: Mar 16, 2025 | 3:07 PM

మనకొచ్చే ఆదాయంలో ఎంతో కొంత డబ్బు పొదుపు చేసుకుంటే.. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అవసరాలకు పనికి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పొదుపు అనేది తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే.. ఫ్యూచర్‌లో ఎప్పుడు ఏం అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితి. అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తట్టుకొని నిలబడాలంటే.. కచ్చితంగా పొదుపు చేయాల్సిందే. అయితే మరి ఎక్కడ పొదుపు చేయాలి? ఎంత పొదుపు చేయాలి? ఎలా చేస్తే అధిక రాబడి వస్తుంది? ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియవు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్నవారికి అందుబాటులో ఉండే స్కీమ్స్‌ కొన్ని ఉన్నాయి. అందులోనా రిస్క్‌ లేకుండా ఉండే పోస్టాఫీస్‌ స్కీమ్స్‌ అయితే పొదుపుకు మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు పొదుపు చేయాలనుకునే పోస్టాఫీస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంకు‌ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుంది. ఈ స్కీమ్ ద్వారా మూడు రెట్లు డబ్బు సంపాదించవచ్చు. అంటే రూ.5 లక్షలు పెడితే రూ.15 లక్షలు వస్తాయి. రూ. 5 లక్షలు 15 లక్షలు అవ్వాలంటే, ముందుగా 5,00,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 5 ఏళ్ళకు ఇన్వెస్ట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ 5 ఏళ్ళ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 7.5 శాతం వడ్డీ ఇస్తుంది. ఇప్పుడున్న వడ్డీ రేటు ప్రకారం చూస్తే, 5 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ రూ.7,24,974 అవుతుంది. ఈ డబ్బును తీయకుండా మళ్ళీ 5 ఏళ్ళకు ఫిక్స్ చేయండి. ఇలా చేస్తే 10 ఏళ్ళలో 5 లక్షలకు వడ్డీ ద్వారా రూ.5,51,175 వస్తుంది. అప్పుడు మీ మొత్తం రూ.10,51,175 అవుతుంది. ఇది రెండు రెట్లకు పైగా. ఆ తర్వాత ఈ డబ్బును మళ్ళీ 5 ఏళ్ళకు ఫిక్స్ చేయాలి. అంటే రెండు సార్లు 5 ఏళ్ళకు ఫిక్స్ చేయాలి. 15వ ఏట మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టిన 5 లక్షలకు వడ్డీ ద్వారా రూ.10,24,149 సంపాదిస్తారు.

మీరు పెట్టిన 5 లక్షలు, వచ్చిన 10,24,149 కలిపితే మొత్తం రూ.15,24,149 వస్తాయి. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ 1 సంవత్సరం ఎఫ్‌డీని మెచ్యూరిటీ తేదీ నుండి 6 నెలల్లోపు పొడిగించవచ్చు. 2 సంవత్సరాల ఎఫ్‌డీని 12 నెలల్లోపు పొడిగించాలి. 3, 5 సంవత్సరాల ఎఫ్‌డీని పొడిగించాలంటే, మెచ్యూరిటీ తర్వాత 18 నెలల్లోపు పోస్ట్ ఆఫీస్‌ అధికారులకు తెలియజేయాలి. అకౌంట్ తెరిచేటప్పుడే మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ పొడిగించమని అడగవచ్చు. మెచ్యూరిటీ రోజున ఉన్న వడ్డీ రేటు పొడిగించిన కాలానికి వర్తిస్తుంది. బ్యాంకుల్లాగే పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌పై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఒక సంవత్సరం అకౌంట్‌కు 6.9 శాతం వడ్డీ వస్తుంది. రెండు సంవత్సరాల అకౌంట్‌లో 7.0 శాతం, మూడు సంవత్సరాల అకౌంట్‌లో 7.1 శాతం వడ్డీ ఇస్తారు. 5 సంవత్సరాల అకౌంట్‌లో 7.5 శాతం వడ్డీ ఇస్తారు.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.