పెరుగుతో ఈ ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసా.?
TV9 Telugu
16 March 2025
పెరుగుతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని తెలిసిందే. ముఖ్యంగా శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే.
అయితే కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పెరగు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో పుష్కలంగా లభించే ల్యాక్టోబాసిలస్ బ్యాక్టీరియా శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి ఉపయోగపడుతుందని నిపుణులు గుర్తించారు.
ఆందోళన, కుంగుబాటు వంటి వాటిని తగ్గించడంలో పెరుగు ఉపయోగపడుతుందని.. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు.
ఎలుకలపై జరిపిన ప్రయోగంలో ఈ విషయం వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. ఎలుకల్లో కుంగుబాటును తగ్గించినట్లు స్పష్టమైంది.
ఇదిలా ఉంటె పెరుగు కారణంగా మానసిక ఒత్తిడి ఎందుకు తగ్గిందన్నదానిపై క్లారిటీ లేదని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే రోగనిరోధక వ్యవస్థలో మధ్యవర్తిగా పనిచేసే ఇంటర్‌ఫెరాన్ గామా పెరగడమే దీనికి కారణంగా భావిస్తున్నారు.
ఈ బ్యాక్టీరియా ఒత్తిడికి శరీరం స్పందించటాన్ని నియంత్రిస్తున్నట్టు.. కుంగుబాటు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు పరిశోధకులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
వేసవిలో ఈ మంచు ప్రాంతాలు భూతల స్వర్గం.. ఒక్కసారైన చూడాలి..
ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా 100కుపైగా టీవీ ఛానెల్లు
ప్రపంచంలోని సొంత సైన్యం లేని దేశాలు ఇవే..!