ఉపాధి హామీ జాబ్‌కార్డులపై దీపికా, జాక్వెలిన్‌ ఫోటోలు

స్కాములు చేయడం ఓ కళ.. అందరికీ రాదు.. ఓ ప్లానూ గీనూ లేకుండా స్కాములు చేస్తే మధ్యప్రదేశ్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం కుంభకోణంలా అవుతుంది.. ఆ రాష్ట్రంలో జిర్న్యా అనే జిల్లా ఉంది.. అందులో పిపర్‌ఖేడా నకా అనే పంచాయితీ ఉంది.. జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే డబ్బును తినేద్దామనుకున్నారు సర్పంచ్‌, కార్యదర్శి.. లబ్ధిదారుల పేరిట నకిలీ జాబ్‌ కార్డులు సృష్టించి సొమ్ము చేసుకున్నారు.. జాబ్‌ కార్డులలో గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోలు పెడితే […]

ఉపాధి హామీ జాబ్‌కార్డులపై దీపికా, జాక్వెలిన్‌ ఫోటోలు
Follow us
Balu

|

Updated on: Oct 16, 2020 | 2:08 PM

స్కాములు చేయడం ఓ కళ.. అందరికీ రాదు.. ఓ ప్లానూ గీనూ లేకుండా స్కాములు చేస్తే మధ్యప్రదేశ్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం కుంభకోణంలా అవుతుంది.. ఆ రాష్ట్రంలో జిర్న్యా అనే జిల్లా ఉంది.. అందులో పిపర్‌ఖేడా నకా అనే పంచాయితీ ఉంది.. జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే డబ్బును తినేద్దామనుకున్నారు సర్పంచ్‌, కార్యదర్శి.. లబ్ధిదారుల పేరిట నకిలీ జాబ్‌ కార్డులు సృష్టించి సొమ్ము చేసుకున్నారు.. జాబ్‌ కార్డులలో గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోలు పెడితే సరిపోయేది కానీ.. వీరు గొప్పగా ఉంటుందని బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పడుకోనె, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫోటోలు పెట్టారు.. అలా నకిలీ జాబ్‌ కార్డులు సృష్టించారు.. ఆయా ఖాతాల నుంచి వచ్చే సొమ్మును తీసుకునేందుకు ఈ ఫేక్‌ జాబ్‌ కార్డులను ఉపయోగించారు.. మోనూ దూబే అనే వ్యక్తి కార్డుపై దీపికా పడుకోనె ఫోటోను పెట్టారు.. మెనూ దూబే అనేవాడు అసలు పనికే వెళ్లలేదు.. కానీ ఆయన పేరును ఉపయోగించుకుని 30 వేల రూపాయలు డ్రా చేశారు.. అలాగే సోను అనే మరో లబ్ధిదారు కార్డుపై జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫోటో పెట్టారు.. ఇలా ప్రతినెలా వచ్చిన సొమ్మునంతా స్వాహా చేయడం మొదలు పెట్టారు.. ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము లబ్ధిదారులకు అందకపోవడంతో స్కామ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. జాతీయ ఉపాధి హామీ పథకం కింద తమకు ఎలాంటి పనులు రాకపోయినప్పటికీ పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్‌, ఉపాధి హామీ అసెస్టింట్లు కలిసి వేలకు వేలు మింగేశారని లబ్దిదారులు అంటున్నారు. స్కామ్‌పై వెంటనే విచారణ జరిపించాలని ఆదేశించారు జిల్లా పంచాయితీ సీఈదో గౌరవ్‌ బెనల్‌.